Mikhail Gorbachev: సోవియట్ మాజీ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచెవ్ క‌న్నుమూత‌

Mikhail Gorbachev: దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోర్బచెవ్

Update: 2022-09-01 02:10 GMT

Mikhail Gorbachev: సోవియట్ మాజీ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచెవ్ క‌న్నుమూత‌

Mikhail Gorbachev: సొవియట్ యూనియన్ మాజీ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచెవ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 91 ఏళ్లు. దూర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచినట్టు సెంట్రల్ క్లినికల్ హాస్పిటల్ ప్రకటించింది. 1931లో మార్చి 2న పేద కుటుంబంలో జన్మించిన ఆయన.. ప్రచ్ఛన్న యుద్తదాన్ని రక్తపాత పోరాటం లేకుండా ముగించారు. అయినప్పటికీ సొవియట్ యూనియన్ పతనాన్ని నిరోధించడంలో ఆయన విఫలమయ్యారు. పౌరులకు స్వేచ్చ ఇవ్వడం ద్వారా ప్రజా స్వామ్య సూత్రాల తరహాలో కమ్యూనిస్టు పాలను సంస్కరించాలని కోరుకునే బలమైన సోవియట్ నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు.

కమ్యూనిస్టు తూర్పు ఐరోపాలోని సొవియట్ కూటమి దేశాలలలో 1989లో ప్రజా స్వామ్య అనుకూల నిరసనలు తీవ్రరూపం దాల్చిన సమయంలో తన బలప్రయోగాన్ని మానుకున్నారు. అధ్యక్ష పదవిని విడిచిపెట్టిన తర్వార గోర్బచెవ్ కు ప్రపంచ వ్యాప్తంగా అనేక అవార్డులు, గౌరవాలు లభించాయి. 1990లో నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది. ప్రచ్ఛన్న యుద్ధాన్ని రక్తపాతం లేకుండా ముగించడంలో ఆయ‌న కీల‌క పాత్ర పోషించిన కారణంగా ఆయ‌న‌కు ఈ స‌త్కారం లభించింది.

Tags:    

Similar News