Nepal: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం.. ప్రయాణికుల్లో ఐదుగురు భారతీయులు

Nepal: నేపాల్‌ విమాన ప్రమాదంలో 67కు చేరిన మృతుల సంఖ్య

Update: 2023-01-15 12:17 GMT

Nepal: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం.. ప్రయాణికుల్లో ఐదుగురు భారతీయులు

Nepal: నేపాల్‌ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 67కు చేరింది. మరో ఐదుగురికి తీవ్రగాయాలు కాగా.. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదసమయంలో విమానంలో 72 మంది ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్టు స్పష్టం చేశారు. 15 మంది విదేశీ ప్రయాణికులు ఉండగా.. వీరిలో ఐదుగురు భారతీయులు ఉన్నట్టు యతి ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. ఘటనాస్థలంలో సహాయక ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ఖాట్మండు నుంచి పొఖారా వెళ్తున్న యతి ఎయిర్‌లైన్స్‌ విమానం ప్రమాదానికి గురైంది. పొఖారా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌ సమయంలో విమానం క్రాష్‌ అయింది. రన్‌వేపై కుప్పకూలింది. విమానం కూలిన తర్వాత భారీగా మంటలు చెలరేగాయి. భారీ శబ్దం రావడంతో స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకొని అధికారులకు సమాచారం అందించారు. ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఇప్పటివరకు 40కి పైగా మృతదేహాలను వెలికితీశారు. పొఖారా ఎయిర్‌పోర్ట్‌ను అధికారులు మూసివేశారు.

Tags:    

Similar News