Lunar Eclipse 2020: ఈరోజు రాత్రి సంపూర్ణ చంద్ర గ్రహణం : ఈ నక్షత్రాల వారు చూడకూడదట!

Update: 2020-01-10 06:55 GMT
Representational emage

ఈరోజు (జనవరి 10 - శుక్రవారం) సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ సంవత్సరంలో మొత్తం చంద్రునికి ఆరు గ్రహణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది ఈరోజు ఏర్పడనుంది. ఈరోజు రాత్రి 10:37 నిమిషాలకు మొదలయ్యే ఈ చంద్ర గ్రహణం తెల్లవారుజామున 2:42 గంటల వరకూ ఉంటుంది.

ఇలా కనిపిస్తుంది..

ఈ చంద్రగ్రహణం భారత దేశంతో పాటు ఇతర ఆసియా దేశాల్లోనూ, ఐరోపా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాల్లో కనిపిస్తుంది. శాస్త్రీయ పద్ధతులను, హిందూ సంప్రదాయాన్ని అనుసరించే విధానంలో పునర్వసు నక్షత్రం మిథున రాశిలో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. భారత కాలమానం ప్రకారం స్పర్శ కాలం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభమై, మధ్యకాలం రాత్రి 12 గంటల 31 నిమిషాలు, మోక్ష కాలం తెల్లవారుజామున 2 గంటల 31 నిమిషాలకు పూర్తవుతుంది. మొత్తం పుణ్యకాలం సమయం నాలుగు గంటలు.

జ్యోతిష్యులు ఏం చెబుతున్నారు..

శాస్త్రాలను అనుసరించేవారు చంద్ర గ్రహణం సమయంలో ఏవిధంగా వ్యవహరించాలో జ్యోతిష్యులు చెబుతున్నారు. వారు చెబుతున్న దాని ప్రకారం ఈ గ్రహణం మిథున రాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఈ గ్రహణాన్ని ఆరాశి వారు చూడకపోవడం మంచిదంటున్నారు. మిథున రాశితోపాటు కర్కాటకం, సింహ, తుల, మకర రాశులపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని పండితులు అంటున్నారు. ఈ చంద్ర గ్రహణం పుష్యమాసం శుద్ధ చతుర్దశి పునర్వసు నక్షత్రం మిథున రాశిలో ఏర్పడుతుంది. కాబట్టి మేషం, కన్య, వృశ్చిక, మీన రాశుల వారికి శుభం.. తుల, వృషభ, ధనుస్సు, కుంభ రాశులవారికి మధ్యమం.. మిథున, కర్కాటక, సింహ, మకర రాశుల వారికి అరిష్టం అంటున్నారు. గ్రహణం సందర్భంగా శుక్రవారం రోజు రాత్రి వేళ భోజనం చేయరాదని కొందరు పండితులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల లోపు భోజనం ముగిస్తే మంచిదని వారంటున్నారు.

గ్రహణం ఏ రాశిలో సంభవిస్తుందో ఆ రాశితోపాటు ప్రతికూల ప్రభావం చూపే రాశులవారు గ్రహణం విడిచిన తర్వాత నదీ స్నానం చేసి ఇష్టదైవాన్ని పూజించాలని చెబుతున్నారు. శివ పంచాక్షరీ మంత్రం జపిస్తే శుభం జరుగుతుంది, గ్రహణం ఏర్పడిన 11 రోజులలోపు శివాలయాలలో రుద్రాభిషేకం చేస్తే దోషాలు, పరిహారం జరుగుతుందని వివరిస్తున్నారు. అలాగే బియ్యం, ఉలవలతోపాటు వెండి చంద్ర బింబం, నాగ పడగలు బ్రాహ్మణులకు దానం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వత్ల గ్రహ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పేర్కొంటున్నారు.

ఇక శాస్త్రీయ పద్ధతులను, హిందూ సంప్రదాయాన్ని అనుసరించే వారు, గ్రహణం ముందు, గ్రహణ సమయంలో, గ్రహణం తరువాత స్నానాలు చేసి ధ్యానం చేస్తూ ఉండవచ్చు. గ్రహణం విడిచిన తరువాత ఇంటిని శుభ్రం చేసి, దేవుడి విగ్రహాలను శుభ్రం చేసుకోవాలి. జంధ్యం వేసుకునే సంప్రదాయం ఉన్నవారు దాన్ని మార్చుకోవాలి. ఇంటిముందు, వ్యాపార సంస్థల ముందు నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయలు, కొబ్బరి కాయలను తీసివేసి వాటి స్థానంలో కొత్తవి కట్టించుకుంటే, గ్రహణ దృష్టి తొలగి శుభ ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. 



Tags:    

Similar News