Indonesia: ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఘోర అగ్ని ప్రమాదం

Indonesia: 17 మంది సజీవదహనం, మరో 50 మందికి గాయాలు

Update: 2023-03-04 06:08 GMT

Indonesia: ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఘోర అగ్ని ప్రమాదం

Indonesia: ఇండోనేసియా రాజధాని జకార్తాలోని ఆయిల్ డిపోలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. 17 మంది సజీవదహనమయ్యారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. మంటలు సమీప ప్రాంతాలకు వ్యాపించడంతో వేలాది మంది నివాసితులను అధికారులు ఖాళీ చేయించారు. దట్టమైన నల్లటి పొగతోపాటు మంటలు ఆకాశానికి ఉవ్వెత్తున ఎగిశాయి. కనీసం 260 మంది అగ్నిమాపక సిబ్బంది, 52 అగ్నిమాపక ఇంజన్లు మంటలను అదుపు చేసేందుకు శ్రమించాయి.

ఉత్తర జకార్తాలోని తనహ్​మేరా ప్రాంతంలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓ ఆయిల్​ డిపోలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఇండోనేసియా ఇంధన అవసరాల్లో 25 శాతం మేర ఈ డిపో నుంచి సరఫరా చేస్తుంది. కాగా, భారీ వర్షంతో పాటుగా పిడుగుల కారణంగా ఈ మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. ఆ మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడం వల్ల.. అగ్నిమాపక అధికారులు నివాస ప్రాంతాల్లో ఉండే వేలాది మంది ప్రజలను హుటాహుటిన ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఘటన ప్రాంతంలో జనావాసాలు ఎక్కువగా ఉండటటంతో భయాందోళన చెలరేగింది. అయితే ఈ అగ్నిప్రమాదం వల్ల దేశ ఇంధన సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగదని అధికారులు భరోసా ఇచ్చారు.


Full View


Tags:    

Similar News