Twitter: ఎలాన్‌ మస్క్‌ చేతికి 'ట్విటర్‌'.. సీఈవో, సీఎఫ్‌వో తొలగింపు

Twitter: 44 కోట్ల డాలర్లకు ట్విట్టర్‌ను దక్కించుకున్నారు

Update: 2022-10-28 04:11 GMT

Twitter: ఎలాన్‌ మస్క్‌ చేతికి ‘ట్విటర్‌’.. సీఈవో, సీఎఫ్‌వో తొలగింపు

Twitter: టెస్లా అధినేత ఎలాన్​ మస్క్ ఎట్టకేలకు ట్విట్టర్‎​ను హస్తగతం చేసుకున్నారు. 44 కోట్ల డాలర్లకు ట్విట్టర్‌ను దక్కించుకున్నారు. ఆ వెంటనే చర్యలకు ఉపక్రమించారు. సీఈఓ పరాగ్ అగర్వాల్‎తో పాటు సీఎఫ్‎వోపై వేటు వేశారు. పలు విభాగాల అధిపతులను మస్క్‌ తొలగించారు. ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌.. నిన్న శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ట్విట్టర్ ఎడ్‌క్వార్టరర్‌లోకి అడుగు పెడుతూ.. ఓ పింగాణి సింక్‌ను పట్టుకురావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన వీడియోను ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ట్విట్టర్‌ హెడ్‌క్వార్టర్స్‌లోకి ఎంటర్‌ అవుతున్నానని... అది సింక్‌ కావాల్సిందేనంటూ ఆ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చారు.

మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ను 4వేల 400 కోట్ల డాలర్లకు ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేశారు. నిన్న ఆ డీల్‌ను ఫైనల్ చేసేందుకు స్వయంగా ట్విట్టర్‌ హెడ్‌ క్వార్టర్‌కు వెళ్లారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానని గతంలో ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. ఆ తరువాత.. డీల్‌కు బ్రేక్‌ వేస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో ట్విట్టర్‌, మస్క్‌ మధ్య మాటల యుద్ధం సాగింది. ఫేక్‌ అకౌంట్లను చూపుతూ ట్విట్టర్‌ మోసాలకు పాల్పడుతున్నట్టు ఎలాన్‌ ఆరోపించారు. డీల్‌ నుంచి తప్పుకునేందుకే మస్క్‌ కావాలని అలాంటి ఆరోపణలు చేసినట్లు ట్విట్టర్‌ విమర్శించింది. ఈ డీల్‌ విషయమై శాన్‌ఫ్రాన్సిస్కోలోని డెలావేర్‌ కోర్టును ట్విట్టర్‌ సంస్థ ఆశ్రయించింది. ఈ కేసును కోర్టు అక్టోబరు 28 వరకు అంటే నిన్నటికి వాయిదా వేసింది. ఒకవేళ అప్పటిలోగా ట్విట్టర్‌, మస్క్ మధ్య ఒప్పందం కుదరకపోతే.. కేసును కోర్టు విచారణ మళ్లీ ప్రారంభించేది. తాజాగా ట్విట్టర్‌ను మస్క్ దక్కించుకోవడంతో‎ ఒప్పందం కొలిక్కివచ్చినట్లైంది.

Tags:    

Similar News