Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. సమీప ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు!

Earthquake: రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదు, మూడు భవనాలు నేలమట్టం

Update: 2022-09-19 02:31 GMT

Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. సమీప ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు!

Earthquake: భారీ భూకంపం తైవాన్‌ను వణికించింది. రిక్టర్‌ స్కేలుపై 6.8 తీవ్రతగా నమోదైంది. ఈ భూకంప కారణంగా మూడు భవనాలు నేలమట్టమయ్యాయి.. రహదార్లు, బ్రిడ్జిలు, రైల్వే లైన్లు ధ్వంసమయ్యాయి. టైలుంగ్‌ కౌంటీలో భూకంపం కేంద్రీకృతమై ఉంది. రెండు భూకంపంలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. దేశ రాజధాని తైపీతో పాటు కావోసియుంగ్‌ నగరంలోనూ ప్రకంపనలు కనిపించాయి. దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తైవాన్‌ అధ్యక్షురాలు సాయ్‌ ఇంగ్‌-వెన్‌ ఫేస్‌బుక్‌లో పిలుపునిచ్చారు. మరోవైపు.. భూకంపం అనంతరం తొలుత సునామీ హెచ్చరికలను జపాన్‌ వాతావరణ శాఖ, పసిఫిక్‌ సునామీ హెచ్చరిక కేంద్రాలు జారీ చేశాయి... అనంతరం భారీ అలలు వచ్చే అవకాశం లేదని తెలిపాయి.

Tags:    

Similar News