Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కుటుంబంలో విషాదం..
Donald Trump's First Wife: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా మేరీ ట్రంప్ (73) కన్నుమూశారు.
డొనాల్డ్ ట్రంప్ కుటుంబంలో తీవ్ర విషాదం
Donald Trump's First Wife: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ (73) కన్నుమూశారు. న్యూయార్క్ నగరంలోని తన నివాసంలో ఇవానా గురువారం (జూలై 14) తుదిశ్వాస విడిచారు. 'న్యూయార్క్ నగరంలోని తన ఇంటిలో ఇవానా ట్రంప్ మరణించారని తెలియజేయడానికి నేను చాలా బాధపడుతున్నాను'' అని మాజీ అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్రూత్ సోషల్‌లో రాశారు.
'న్యూయార్క్ సిటీలోని తన నివాసంలో ఇవానా మరణించింది. ఆమె అందమైన, అద్భుతమైన మహిళ. గొప్ప స్ఫూర్తిదాయక జీవితాన్ని గడిపింది. ఆమెకు తన ముగ్గురు పిల్లలు డొనాల్డ్ జూనియర్, ఇవాంక, ఎరిక్‍లే సర్వస్వం. ఆమె పట్ల మేమూ గర్వపడుతున్నాం. ఇవానా ఆత్మకు శాంతి చేకూరాలి' అని ట్రంప్ భావోద్వేగ సందేశాన్ని రాసుకొచ్చారు.