Trump-Elon Musk: మూడో పార్టీని అమెరికన్లు అంగీకరించరు.. డోనాల్డ్ ట్రంప్ ట్వీట్
Trump-Elon Musk: అమెరికాలో ఇటు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, అటు బిలయనీర్ ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
Trump-Elon Musk: మూడో పార్టీని అమెరికన్లు అంగీకరించరు.. డోనాల్డ్ ట్రంప్ ట్వీట్
Trump-Elon Musk: అమెరికాలో ఇటు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, అటు బిలయనీర్ ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల ఎలాన్ మస్క్ అమెరికన్ పార్టీ అనే మూడో పార్టీని పెట్టనున్నట్టు ప్రకటించడంతో సోషల్ మీడియా వేదికగా మస్క్ పై ట్రంప్ మండిపడ్డారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో మస్క్‌తో తనకున్న స్నేహబంధాలు తెగిపోయాయని..ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. వివరాలు చూద్దాం.
మూడో పార్టీ పెడతానని మస్క్ ప్రకటించిన తర్వాత అతనిపై ట్రంప్ తీవ్రంగా మండిపడుతున్నారు. తన సోషల్ మీడియాలో దానికి సంబంధించిన పోస్టులు పెడుతున్నారు. ఎలాన్ మస్క్ ప్రస్తుతం గాడి తప్పి ఉన్నాడు. మూడో పార్టీ పెట్డడం అనేది ఒక హాస్యాస్పదమైన విషయమని తన సోషల్ మీడియలో ట్రంప్ తాజాగా పోస్ట్ చేశారు. అంతేకాదు, గత ఐదు వారాలుగా ఎలాన్ మస్క్ పూర్తిగా నియంత్రణ కోల్పోయాడని, మా మధ్య ఉన్న స్నేహ బంధాన్ని పూర్తిగా తెంచేసాడని ట్రంప్ అన్నారు. అమెరికాలో మూడో పార్టీ పెట్టడం అనేది నవ్వు తెప్పించే విషయం. ఎందుకంటే ఇది విజయం సాధించదు. అమెరికన్లు మూడో పార్టీని అంగీకరించరు.. రెండు పార్టీల వ్యవస్థను మాత్రమే అమెరికన్లు అనుసరిస్తారు. అంతేగానీ మూడో పార్టీ అనేది గొడవలకు దారి తీస్తుంది తప్ప...దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేదని ట్రంప్ తను పోస్ట్ చేసిన పోస్ట్‌లో తెలిపారు.
దీంతోపాటు, ప్రస్తుతం దేశంలో రిపబ్లికన్ ప్రభుత్వం సజావుగా సాగుతుంది. ఇటీవల దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా బిగ్ బ్యూటిఫుల్ బిల్లు వచ్చింది. అయితే దీన్ని మస్క్ వ్యతిరేకించారు. దానికి కారణం మస్క కోరుకుంటున్నట్లు దేశంలో ఉన్నవారంతా ఎలక్ట్రికల్ వాహనాలను వినియోగించడం సాధ్యం కాదు. చాలా తక్కువ సమయంలో ప్రతిఒక్కరు ఎలక్ట్రిక్ వాహనాలు కొనలేరు. దీన్ని నేను ముందు నుంచీ వ్యతిరేకస్తున్నా.. ఇప్పుడు సభలో పాసైన తాజా బిల్లు ప్రకారం.. ప్రజలు తమకు నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. ఇది మస్క్‌కు ఎంత మాత్రం ఇష్టం కావడం లేదు. కానీ ప్రజల రక్షణను దృష్టిపెట్టుకునే తాను మాత్రం పనిచేస్తానని ట్రంప్ తన పోస్ట్‌లో వివరించారు.
అమెరికాలో ఇప్పటివరకు రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీలు మాత్రమే ప్రధానంగా ఉన్నాయి. కొన్నేళ్ల నుంచి ఇదే పరిస్థితి. కొత్త పార్టీలు పుట్టుకొచ్చినా.. వాటి మాట ఎక్కడా వినడదు. కనబడదు. ఈ రెండు పార్టీలు మాత్రమే ఎన్నికల్లో పాల్గొంటయాయి. అయితే కొన్నాళ్ల నుంచి రిపబ్లికన్ పార్టీ విజయాన్ని సాధిస్తూ వస్తుంది. అయితే తాజాగా ఎలాన్ మస్క్ ప్రజలకు మంచి పాలన అందించేందుకు మూడో పార్టీ అమెరికన్ పార్టీని తీసుకొచ్చానని ప్రకటించారు. దీంతో ఇప్పుడు దేశమంతా ఈ మూడో పార్టీ గురించే మాట్లాడుకుంటున్నారు.