చెక్‌ రిపబ్లిక‌‌లో అత్యంత పొడవైన వేలాడే బ్రిడ్జి

*రెండు పర్వాతాల మధ్య 721 మీటర్ల పొడవుతో.. 84 లక్షల డాలర్లతో నిర్మించిన చెక్‌ ప్రభుత్వం

Update: 2022-05-15 03:30 GMT

చెక్‌ రిపబ్లిక‌‌లో అంత్యం పొడవైన వేలాడే బ్రిడ్జి

World Longest Sky Bridge: ప్రపంచంలోనే అత్యంత పొడవైన వేలాడే బ్రిడ్జిని చెక్‌ రిపబ్లిక్‌ దేశం ప్రారంభించింది. ఇప్పుడు ఈ బ్రిడ్జి చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అద్భుతమైన ప్రకృతి, మేఘాలను తాకుతున్నాయన్నట్టుగా ఉండే రెండు కొండల మధ్యన నిర్మించిన ఈ వంతెనకు స్కై బ్రిడ్జి 721 పేరును పెట్టారు. ఈ బ్రిడ్జి పరిసరాల్లోని ప్రకృతి సౌందర్యం ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందో వంతెన పైకి వెళ్తే అంతే భయం కూడా కలుగుతుంది.

లోయలో 95 మీటర్ల ఎత్తున వేలాడుతూ 721 మీటర్ల పొడవుతో రెండు కొండలకు మధ్య వేలాడే వంతెనను రెండేళ్ల పాటు నిర్మించారు. దీనికి 84 లక్షల డాలర్లను చెక్‌ ప్రభుత్వం వెచ్చించింది. ప్రపంచంలోనే పొడవైన వేలాడే వంతెనగా నేపాల్‌లోని బగ్లుంగ్‌ పర్వతల్లోని బ్రిడ్జికి పేరుంది. దీని రికార్డును స్కైబ్రిడ్జి 721 బద్దలు కొట్టి గిన్నీస్‌ బుక్‌ రికార్డులకెక్కింది. ఈ వంతెన రాజధానికి ప్రేగ్‌కు సమీపంలో ఉంది.

Full View


Tags:    

Similar News