Coronavirus Vaccine Update: వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చేది అప్పుడే : డబ్ల్యూహెచ్ఓ

Update: 2020-07-23 07:42 GMT

Coronavirus Vaccine Update: కోవిడ్-19 కు వ్యతిరేకంగా వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడంలో పరిశోధకులు మంచి పురోగతి సాధిస్తున్నారు, చివరి దశ ట్రయల్స్ లో కొన్ని ఉన్నాయి, అయితే వాటి మొదటి ఉపయోగం మాత్రం 2021 జనవరి వరకు ఆశించవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిపుణుడు బుధవారం చెప్పారు. సరైన వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి డబ్ల్యూహెచ్ఓ పనిచేస్తోందని , అయితే ఈలోపు వైరస్ వ్యాప్తిని అణిచివేసేందుకు ఇది కీలక సమయం అని డబ్ల్యూహెచ్ఓ అత్యవసర కార్యక్రమాల అధిపతి మైక్ ర్యాన్ అన్నారు, టీకా తయారీలో మంచి పురోగతి సాధిస్తున్నామని మైక్ ర్యాన్ స్పష్టం చేశారు, అనేక సంస్థలు టీకాను అభివృద్ధి చేస్తున్నాయని.. ఇవి ఇప్పుడు 3వ దశలో ఉన్నాయని.. ఇప్పటివరకూ ఏదీ విఫలమవ్వలేదని, అభివృద్ధి చేసిన అన్ని టీకాలు భద్రత మరియు రోగనిరోధక

ప్రతిస్పందనను ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయని అన్నారు. ఈ టీకా ప్రజలకు ఇవ్వడానికి వచ్చే ఏడాది జనవరి అవుతుందని ఆయన అన్నారు. కొన్ని సంస్థలు వ్యాక్సిన్ అభివృద్ధి తోపాటుగా సమాంతరంగా ప్రజలకు అవసరమయ్యే విధంగా కోట్లాది వ్యాక్సిన్ డోసులను తయారు చేస్తుందని అన్నారు. ఈ టీకా పేదవారికోసమో ధనవంతులకోసమో కాకుండా అందరికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ర్యాన్ తెలిపారు. ఇక కోవిడ్-19 కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అదుపులోకి వచ్చే వరకు పాఠశాలలు తిరిగి తెరవడం పట్ల జాగ్రత్తగా ఉండాలని ర్యాన్ హెచ్చరించారు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో మహమ్మారి మంటలు చెలరేగినప్పటికీ పాఠశాలలను పునఃప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. 

Tags:    

Similar News