మరో రెండు వారాల్లో మరణాల రేటు భారీగా పెరిగే అవకాశం : ట్రంప్‌

Update: 2020-03-30 08:19 GMT

కరోనా అమెరికాను గడగడలాడిస్తోంది. స్పీడ్ గా పెరుగతోన్న పాజిటివ్ కేసులు అగ్రరాజ్యాన్ని అల్లాడిస్తోంది. మృతుల సంఖ్య భారీగా ఉండటం మరింత కలవరపరుస్తోంది. కరోనా పంజా విసురుతోన్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండు వారాల్లో మరణాల రేటు భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. కరోనా కట్టడికి కోసం చేపట్టిన ఆంక్షల్ని ఏప్రిల్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ప్రజలంతా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అప్పటి వరకు సోషల్ జస్టిస్ ను పాటించాల్సిందేనని సూచించారు.

మరికొన్ని వారాల్లో దేశంలో పరిస్థితులు యథాతథ స్థితికి చేరుకుంటాయని ఇటీవల ఓ సందర్భంలో అభిప్రాయపడ్డ ట్రంప్‌ ఇప్పుడు ఆ మాటల నుంచి వెనక్కితగ్గడం అక్కడి పరిస్థితి తీవ్రతకు తెలియజేస్తోంది. ఈస్టర్‌ పర్వదినం నాటికి అంతా సర్దుకోవాలని తాను ఆశించానన్నారు ట్రంప్. కానీ, పరిస్థితులు ఆ దిశగా సాగడం లేదన్నారు.

కరోనా పంజాతో జనసంచారంపై ఆంక్షల్ని మరో నెలపాటు కొనసాగించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో లక్ష మందికిపైగా ప్రాణాలను కరోనా బలి తీసుకునే ముప్పుందని ఆ దేశ ఆరోగ్య శాఖ నిపుణుడు ఆంథోనీ ఫాసీ అంచనా వేశారు. ఈ వైరస్‌ బెడద ఇప్పుడిప్పుడే తొలగిపోయేలా కనిపించడం లేదన్నారు. కొవిడ్‌ దెబ్బకు మృత్యువాతపడే వారి సంఖ్య లక్ష నుంచి 2 లక్షల మధ్య ఉంటుందనిపిస్తోందన్నారు.



Tags:    

Similar News