ప్రపంచాన్ని కుదిపేస్తోన్నక‌రోనా కరాళ నృత్యం

Update: 2020-04-07 07:55 GMT

కరోనా మహమ్మారితో యావత్‌ ప్రపంచం గడగడలాడుతోంది. 208 దేశాల్లో రోజు రోజుకు కరోనా తన ప్రతాపాన్ని చూపుతోంది. వైరస్‌తో బలౌతున్న వారి సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 13 లక్షల, 46వేల, 035 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 74 వేల మందిని కరోనా వైరస్‌ బలితీసుకుంది. యూర్‌ప్‌లో అత్యధికంగా 50వేల125 మంది మృత్యువాతపడ్డారు. 15వేల877 మరణాలతో ఇటలీ, 13వేల 55 మరణాలతో స్పెయిన్‌, 8వేల 78 మరణాలతో ఫ్రాన్స్‌ విషాదంలో కూరుకుపోయాయి. యూర్‌ప్‌లో ఒక్కరోజే 1100 మంది చనిపోయారు.

ఇక అగ్రరాజ్యం అమెరికాను కరోనా వణికిస్తుంది. కరోనా మరణాల సంఖ్య 10వేల మార్క్‌ను దాటింది. ప్రతి నాలుగు ఆస్పత్రుల్లో మూడు కరోనా బాధితులతో నిండిపోయాయి. రోజుకు వందల సంఖ్యలో చనిపోతున్నారు. ఇప్పటి వరకు అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు 3 లక్షల,67వేల, 004కి చేరుకున్నాయి.

ఫ్రాన్స్ , జర్మనీ, యూకేలో పరిస్థితి దారుణంగా ఉంది. కరోనా కాటుకు రోజుకు వేలాది మంది బలౌతున్నారు. ఫ్రాన్స్ లో పాజిటివ్ కేసుల సంఖ్య 9810కి చేరగా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 7వేల 560 మంది మరణించారు. లక్ష పాజిటివ్‌ కేసుల జాబితాలో జర్మనీ చేరిపోయింది. ఇప్పటికి 1500 మంది చనిపోయారు. స్పెయిన్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ‌్య లక్షా, 36వేల 675కి చేరింది. ఇటలీలో లక్షా, 32వేల, 547, ఇరాన్‌ 60వేల 500 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 16వేలకు పైగా మరణాలు సంభవించాయి.

కరోనా వైరస్ తొలుత వెలుగులోకి వచ్చిన చైనాలో కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. చైనాలో 81వేల 740 మందికి కరోనా సోకగా వీరిలో 3వేల329 మంది మరణించారు. ఒకవైపు కరోనా వైరస్ తగ్గిందని భావిస్తుంటే మరోవైపు కొత్తగా కేసులు బయటపడటం చైనా వాసులను ఆందోళన కలిగిస్తోంది.


Tags:    

Similar News