Coronavirus: స్పెయిన్ చైనాను దాటేసింది!

Update: 2020-03-25 12:57 GMT
coronavirus death troll (representational image)

ప్రపంచ వ్యాప్తంగా వేగంగా పరుగులు తీస్తోంది కరోనా వైరస్. సకల మానవాళిని గడగడలాడిస్తోంది. చైనా లో కరోనా తీవ్రత తగ్గిందని వార్తలు వచ్చాయి. అటు తరువాత ప్రపంచంలో పలు దేశాల్లో కరోన వ్యాప్తి పెరిగిపోయింది. ముఖ్యంగా ఇటలీ, స్పెయిన్, అమెరికా, ఇరాన్ లు ఇప్పుడు కరోనా వైరస్ తో వణికిపోతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 4.34 లక్షలు దాటిపోయింది. ఇక మరణించిన వారి సంఖ్య 20 వేలకు చేరువకు వచ్చింది. కరోనా మరణాల్లో ఇటలీ ఇప్పటికే చైనాను దాటేయగా.. తాజాగా స్పెయిన్ కూడా కరోనా పుట్టిల్లును అధిగమించింది.

కరోనా కారణంగా గత 24 గంటల్లో 738 మంది చనిపోయారని స్పెయిన్ ప్రభుత్వం తెలిపింది. దీంతో ఆ దేశంలో మరణాల సంఖ్య 3434కు చేరింది. కోవిడ్ కారణంగా చైనాలో 3281 మంది చనిపోయారు.

కరోనాను కట్టడి చేయడం కోసం స్పెయిన్ గత 11 రోజులుగా ఆ దేశంలో లాక్‌డౌన్ చేపట్టారు. అయినా, పరిస్థితి మాత్రం అదుపులోకి రావడం లేదు. ఇప్పటి వరకూ స్పెయిన్‌లో 47,610 మంది కరోనా బారిన పడ్డారని ఆ దేశ

ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రోజు రోజుకూ కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య, మృతుల సంఖ్యపెరుగుతుండటంతో స్పెయిన్ లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్ ప్రాంతంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక్కడ మంగళవారం నాటికి 12 వేల మందికిపైగాకోవిడ్ బారిన పడ్డారు. 1500 మందికిపైగా చనిపోయారు. రోజుకు 700 మంది వరకు చనిపోతుండటంతో శవాలను ఖననం చేయడానికి కూడా ఇబ్బంది తలెత్తుతోంది.

ఇక ఇటలీలో 54 వేల మందికిపైగా కరోనా బారిన పడ్డారు. మరణించిన వారి సంఖ్య 6800 దాటింది.

Tags:    

Similar News