America Corona Outbreak: అమెరికాలో కరోనా పంజా

Update: 2020-03-25 04:10 GMT
coronavirus death troll (representational image)

అమెరికాను కరోనా అల్లాడిస్తోంది. మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 130 మంది చనిపోయారు.దాదాపు 10 వేల కేసులు నమాదయ్యాయి.వేగంగా విస్తరిస్తున్న మహమ్మారి.. పెద్దన్నను కలపరుస్తోంది. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా..మరణాల సంఖ్య ఎక్కవగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం మృతుల సంఖ్య 622కి చేరుకుంది.

యూఎస్ లో వైరస్ బారినపడిన ప్రతి ఇద్దరిలో ఒకరు న్యూయార్క్ కు చెందిన వారే. ఈనగరంలో 24 గంటల వ్యవధిలో 5వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. న్యూయార్క్‌ సిటీ, మెట్రో ఏరియా, న్యూజెర్సీ, లాండ్‌ ఐలాండ్‌ ప్రాంతాల్లో ప్రతి వెయ్యిమందిలో ఒకరికి కరోనా సోకిందని వైట్‌ హౌస్‌ తెలిపింది.

మరోవైపు మాస్క్ లు, శానిటైజర్లు ఇతర మందులను అక్రమంగా నిల్వ చేస్తే, కఠిన చర్యలు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. అధిక ధరలకు విక్రయిస్తే, శిక్ష తప్పదన్నారు. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న న్యూయార్క్‌లో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ట్రంప్ చెప్పారు.  

Tags:    

Similar News