Coronavirus: ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా మరణాలు

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

Update: 2020-03-15 05:42 GMT
Representational Image

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దాదాపు 145 దేశాలకు ఈ వైరస్‌ విస్తరించింది. కరోనాతో ఇప్పటి వరకు 5వేల 423 మంది మృతి చెందారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షా 56వేల మంది కరోనా బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. బ్రెజిల్‌ ప్రెసిడెంట్‌ బోల్సోనారో కరోనా పరీక్షలు చేసుకున్నారు.

మరో పక్కా.. ఆస్ట్రేలియా హోంమంత్రి పీటర్‌ డుటన్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం. కరోనా నేపథ్యంలో బ్రిటన్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసింది. చైనాలో కరోనా వైరస్‌ మృతుల సంఖ్య 3వేల 199, ఇటలీలో ఒక వెయ్యి 411, ఇరాన్‌లో 611, స్పెయిన్‌లో 195, ఫ్రాన్స్‌లో 91, దక్షిణ కొరియాలో 72కి చేరాయి.


Tags:    

Similar News