Covid: అగ్రరాజ్యంలో కరోనా విజృంభణ.. వారానికి 350 మంది మృతి!

Update: 2025-05-28 01:15 GMT

COVID cases: దేశంలో మరోసారి పడగవిప్పిన కోవిడ్..4వేలకుపైగా యాక్టివ్ కేసులు..!!

Covid: అమెరికాలో కోవిడ్ 19 వైరస్ పంజా విప్పుతోంది.వందల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు, వ్రుద్ధులు, దీర్ఘకాలిక రోగులు వంటి హైరిస్క్ గ్రూప్ వారికి కోవిడ్ ప్రాణ సంకటంగా మారిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో గత నెల రోజుల్లో సగటున వారానికి 350 వరకు కోవిడ్ మరణాలు నమోదు అయినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గణాంకాలు వెల్లడించాయి. ఇవి మరింత పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో నమోదు అవుతున్న కేసుల్లో అత్యధికం ఎన్ బీ.1.8.1 వేరియంట్ వే అని సీడీసీ తెలిపింది. చైనాలో మళ్లీ కోవిడ్ కేసులు పెరగడానికి, ఇతర ఆసియా దేశాల్లో కేసులు నమోదు కావడానికి ఈ వేరియంటే కారణమని చెబుతున్నారు.

కొత్త వేరియంట్ కేసులు అమెరికాలోని వాషింగ్టన్, కాలిఫోర్నియా, న్యూయార్క్ సిటీ, వర్జీనియా వంటి రాష్ట్రాల్లో రోజూ నమోదు అవుతున్నాయని అధికారులు తెలిపారు. ఆయా రాష్ట్రాల్లోని ఎయిర్ పోర్టుల్లో విదేశీ పర్యాటకులకు పరీక్షలు నిర్వహించగా ఎన్ బీ 1.8.1 వేరియంట్ బాధితులను గుర్తిస్తున్నట్లు తెలిపారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్ వంటి దేశాలకు చెందిన ప్రయాణికుల్లోనూ ఈ వైరస్ గుర్తిస్తున్నామని తెలిపారు. ఒహియో, హవాయి వంటి రాష్ట్రాల్లో స్థానికుల్లోనూ ఈ వైరస్ సోకినట్లు తెలిపారు. ఈ పరిణామాలపై డ్యూక్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ టోనీ మూడీ స్పందించారు. ఈ స్థాయిలో మరణాలు నమోదు అవుతున్నాయంటే వైరస్ మన చుట్టూ వ్యాపించి ఉందని అర్థం. సమీప భవిష్యత్తులో కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అమెరికాలో వ్యాక్సినేషన్ తక్కువగా నమోదు కావడం ప్రజల్లో ఇమ్యూనిటీ క్షీణించడం సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వంటి కారణాల వల్లే కోవిడ్ విజ్రుంభిస్తుందని స్పష్టం చేశారు.

Tags:    

Similar News