Kabul Airport: అఫ్గాన్ల ప్రాణ భయానికి నిదర్శనం కాబుల్‌ ఎయిర్‌పోర్టు

Kabul Airport: తాలిబన్లు కాబుల్‌ను చుట్టుముట్టడంతో దేశ ప్రజల పరుగులు * దేశం విడిచి వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు పోటెత్తిన జనం

Update: 2021-08-16 08:29 GMT

కాబుల్ ఎయిర్పోర్ట్ లో కిక్కిరిసిన జనం (ఫైల్ ఇమేజ్)

Kabul Airport: తాలిబన్లకు అఫ్గాన్లు వణికిపోతున్నారు. ఎప్పుడేం చేస్తారో అని ప్రాణాలను అరచేతిలోపెట్టుకొని పరుగులు తీస్తున్నారు. ఇళ్లు వాకిలి, దేశం వదిలిపెట్టి వెళ్తున్నారు. దీంతో అఫ్గానిస్థాన్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆఫ్గాన్లు సునామీలా వచ్చిచేరారు. వేలమంది ప్రజలు దేశం వీడేందుకు ఏకంగా విమానాల వద్దకే పరుగులు పెడుతున్నారు.

దేశంలోని వివిధ రాష్ట్రాల రాజధానులను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో చాలా మంది ఆఫ్గాన్లు మొదట కాబుల్‌కు వలసవచ్చారు. ఇక్కడ ప్రభుత్వ బలగాలు ఎక్కువగా ఉండటంతో ముష్కర మూకలను అడ్డుకొంటాయని వారు ఆశించారు. కానీ, ఊహించిన దానికన్నా వేగంగా తాలిబన్లు కాబుల్‌ను చుట్టుముట్టడంతో ప్రజలు ఒక్కసారిగా పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు.

హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని పౌర టెర్మినల్‌ కిక్కిరిసిపోయింది. ఒక్కో విమానం వద్ద వందల సంఖ్యలో ప్రజలు గుమిగూడిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్రజలు ఒక్కసారిగా విమానాల వద్దకు చొచ్చుకురావడంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో ప్రాణభయంతో అఫ్గానిస్తాన్ దేశస్తులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాబుల్‌ నుంచి ఢిల్లీకి వరుసగా విమానాలను నడిపేందుకు ఎయిర్‌ ఇండియా సిబ్బందిని సిద్ధం చేస్తోంది. రెండు విమానాలను అత్యవసరాల కోసం సిద్ధంగా ఉంచింది. 

Tags:    

Similar News