Justin Trudeau: భారత్‌పై కెనడా ప్రధాని మరోసారి సంచలన వ్యాఖ్యలు

Justin Trudeau: వియన్నా ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందని మండిపాటు

Update: 2023-11-13 05:59 GMT

India-Canada Row: భారత్ పై ఆరోపణలు..ఆ సమయంలో మా వద్ద ఆధారాల్లేవ్: ట్రూడో

Justin Trudeau: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్‌ను నిందించారు. భారత్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని మండిపడ్డారు. తమ పౌరుడి హత్యపై విచారణ జరపాలని కోరారు. పెద్ద దేశాలు చట్టాలు ఉల్లంఘిస్తే ప్రపంచానికి ప్రమాదకరమని అన్నారు. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత్ చట్టాలను ఉల్లంఘించి ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీసిందని ట్రూడో ఆరోపించారు.

నిజ్జర్ హత్య కేసులో నిజానిజాలు తేల్చేందుకు భారత్, మిత్రదేశాలైన అమెరికాతో కలిసి పనిచేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రూల్ ఆఫ్‌ లాకు కెనడా కట్టుబడి ఉంటుందని చెప్పారు. ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేయాల్సిందిగా తమ దేశ యంత్రాంగానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ఈ వివాదాన్ని కొనసాగిస్తూ ప్రపంచ వేదికలపై ట్రూడో ఇప్పటికే పలుమార్లు ప్రస్తావించారు. బ్రిటన్, యూఏఈ పర్యటనల్లోనూ భారత్‌ను నిందించారు. దర్యాప్తుకు సహకరించాలని డిమాండ్ చేశారు. దర్యాప్తుకు సహకరించేలా భారత్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారు.

Tags:    

Similar News