Omicron Variant: కరోనాకు సరికొత్త యాంటీబాడీ చికిత్సకు బ్రిటన్‌ ఆమోదం

ఒమిక్రాన్‌పై పనిచేయొచ్చని ఎంహెచ్‌ఆర్‌ఏ అభిప్రాయం క్లినికల్‌ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు

Update: 2021-12-03 05:48 GMT

కరోనాకు సరికొత్త యాంటీబాడీ చికిత్సకు బ్రిటన్‌ ఆమోదం (ఫోటో: ఫోర్బ్స్)

Omicron Variant: కొవిడ్‌-19కు సరికొత్త యాంటీబాడీ చికిత్సను బ్రిటన్‌లోని ‌MHRA ఆమోదించింది. ఇది ఒమిక్రాన్‌ వంటి కొత్త వేరియంట్లపైనా సమర్థంగా పనిచేయొచ్చని భావిస్తోంది. సోత్రోవిమాబ్‌ అనే ఈ ఔషధాన్ని సింగిల్‌ మోనోక్లోనల్‌ యాంటీబాడీలతో తయారుచేశారు. కరోనా వైరస్‌పైన ఉండే కొమ్ము ప్రొటీన్‌కు ఇది అంటుకుంటుంది. దాంతో అది మానవ కణాల్లోకి ప్రవేశించకుండా నిలువరిస్తుంది. ఇది సురక్షితమైన ఔషధమని, తీవ్రస్థాయి అనారోగ్యం ముప్పున్నవారికి బాగా ఉపయోగపడుతుందని MHRA చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జూన్‌ రైనే తెలిపారు.

సోత్రోవిమాబ్‌ను రక్తనాళాల ద్వారా 30 నిమిషాల పాటు ఇస్తారు. 12 ఏళ్లు పైబడినవారికి కూడా ఇది ఇవ్వవచ్చు. ముప్పు అధికంగా ఉండే పెద్దల్లో వ్యాధి లక్షణాలతో కూడిన కొవిడ్‌ తలెత్తినప్పుడు వారు ఆస్పత్రి పాలు కాకుండా, మరణం బారినపడకుండా 79 శాతం మేర ఈ ఔషధం రక్షిస్తుందని క్లినికల్‌ పరీక్షల్లో వెల్లడైంది. వ్యాధి లక్షణాలు బయటపడిన వెంటనే దీన్ని ఇస్తే మంచి ప్రయోజనం ఉంటుందని పరిశోధకులు తెలిపారు.

Tags:    

Similar News