సిరియాలో ఘోరం.. బాంబు దాడిలో 40 మంది మృతి

ఉత్తర సిరియా పట్టణమైన ఆఫ్రిన్‌లో మంగళవారం బాంబు పేలింది. దీంతో 11 మంది పిల్లలతో సహా 40 మంది పౌరులు మరణించారు, సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది.

Update: 2020-04-29 04:52 GMT

ఉత్తర సిరియా పట్టణమైన ఆఫ్రిన్‌లో మంగళవారం బాంబు పేలింది. దీంతో 11 మంది పిల్లలతో సహా 40 మంది పౌరులు మరణించారు, సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది. ఘటనా స్థలికి చేరుకొని గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించింది. ఈ విధ్వంసానికి సిరియా కుర్దిష్ వైపిజి మిలీషియా సంస్థ కారణమని టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఆఫ్రిన్ కేంద్రంలో రద్దీగా ఉన్న ప్రాంతంలో పేలుడు సంభవించిందని మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో ఒక ప్రకటనలో తెలిపింది. మంగళవారం ఆలస్యంగా ఈ దాడిని అమెరికా ఖండించింది, ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి మోర్గాన్ ఓర్టగస్ ఈ దాడిపై ప్రకటన విడుదల చేశారు. సిరియాలో దేశవ్యాప్తంగా కాల్పుల విరమణ కోసం అమెరికా పిలుపునిస్తూ ఒక ప్రకటనలో తెలిపారు. "ఇటువంటి సంఘటనలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.


Tags:    

Similar News