Bitcoin : నాలుగు నెలల తర్వాత ఆల్-టైమ్ హైకి బిట్‌కాయిన్: క్రిప్టో మార్కెట్‌లో జోష్!
Bitcoin : ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ బుధవారం ఒక కొత్త రికార్డును సృష్టించింది.
Bitcoin : నాలుగు నెలల తర్వాత ఆల్-టైమ్ హైకి బిట్‌కాయిన్: క్రిప్టో మార్కెట్‌లో జోష్!
Bitcoin : ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ బుధవారం ఒక కొత్త రికార్డును సృష్టించింది. జనవరి 2025 తర్వాత బిట్‌కాయిన్ మరోసారి ఆల్-టైమ్ హైకి చేరుకుంది. ఈ అద్భుతమైన పెరుగుదలకు టారిఫ్ వివాదాల పరిష్కారం దిశగా సాగడం ఒక ప్రధాన కారణమని భావిస్తున్నారు. బుధవారం 2025న బిట్‌కాయిన్ ఒక్క రోజులో 2 శాతం పెరిగి, 109,481.83డాలర్ల సరికొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది.
బిట్‌కాయిన్ ధరలు తరచుగా టెక్ షేర్ల మాదిరిగానే కదలికలను చూపుతాయి. షేర్ మార్కెట్లలోని హెచ్చుతగ్గులు బిట్‌కాయిన్‌పై కూడా ప్రభావం చూపుతాయని గమనించవచ్చు. ఏప్రిల్ 2025తో పోలిస్తే, నాస్‌డాక్ (Nasdaq) ప్రస్తుతం 30 శాతం వృద్ధిని నమోదు చేసింది. కొంతకాలంగా డాలర్ బలహీనపడుతూ ఉండడం కూడా బిట్‌కాయిన్ ధరల పెరుగుదలకు దోహదపడింది. అమెరికన్ కరెన్సీకి వ్యతిరేకంగా బిట్‌కాయిన్ విలువ పెరగడం స్పష్టంగా కనిపిస్తోంది.
కాయిన్ స్విచ్ (CoinSwitch) నివేదిక ప్రకారం.. కాయిన్ ఇటీవలి పెరుగుదల జనవరి తర్వాత అత్యధిక స్థాయిని సూచిస్తుంది. BTC ఫ్యూచర్స్ ఓపెన్ ఇంటరెస్ట్ 10.65శాతంపెరిగి 74.35 బిలియన్ డాలర్లకు చేరుకోడానికి ఇది కారణమైంది. ఇందులో బైనాన్స్ (Binance) 12.28 బిలియన్ డాలర్లతో గణనీయమైన వాటాను కలిగి ఉంది. యు.ఎస్. స్పాట్ బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లు (ETFs) కూడా మంగళవారం 41.7 మిలియన్ డాలర్ల నికర ప్రవాహాన్ని నమోదు చేశాయి. ఇది వరుసగా ఐదవ రోజు సానుకూల ధోరణిని కొనసాగించింది.
ప్రస్తుతం, బిట్‌కాయిన్ మార్కెట్ క్యాప్ 2.12 ట్రిలియన్ డాలర్లుగా ఉంది, దాని ట్రేడింగ్ వాల్యూమ్ 50.38 బిలియన్ డాలర్లుగా ఉంది. బిట్‌కాయిన్‌తో పాటు, ఇథీరియం, సోలానా, లిట్‌కాయిన్, కార్డానో వంటి ఆల్ట్‌కాయిన్‌లలో కూడా వృద్ధి కనిపించింది. ఇథీరియం 0.30 శాతం పెరిగి 2,564.52డాలర్లకు చేరుకుంది. XRP కూడా పెరిగి 2.37డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. యునోకాయిన్ (Unocoin) సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ సాత్విక్ విశ్వనాథ్ మాట్లాడుతూ.. "బిట్‌కాయిన్ 107,000డాలర్ల మార్క్ వద్ద స్థిరపడుతోంది, 98,000డాలర్ల వద్ద బలమైన మద్దతు, 109,500డాలర్ల వద్ద కీలక నిరోధకత ఉంది. ఈ స్థాయిని దాటితే, తదుపరి టార్గెట్ 112,000డాలర్లు కావచ్చు" అని తెలిపారు. ఈ లోపు ఇథీరియం గత నెలలో బిట్‌కాయిన్ కంటే మెరుగ్గా పనితీరు కనబరిచింది, దాదాపు 60శాతం పెరిగిందని ఆయన పేర్కొన్నారు.