Elon Musk: ఎలాన్ మస్క్ కు బిగ్ షాక్..21 మంది డోజ్ ఉద్యోగుల రాజీనామా

Update: 2025-02-26 02:30 GMT

Elon Musk: ఎలాన్ మస్క్ కు బిగ్ షాక్..21 మంది డోజ్ ఉద్యోగుల రాజీనామా

 Elon Musk: ఎలాన్ మస్క్ కు బిగ్ షాకిచ్చారు డోజ్ ఉద్యోగులు. ఫెడరల్ ఉద్యోగులను తొలగించే ప్రక్రియలో భాగస్వాములం కాలేమంటూ మస్క్ ఆధ్వర్యంలోని డోజ్ లో పనిచేస్తున్న 21 మంది సివిల్ సర్వీస్ ఉద్యోగులు మంగళవారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కీలకమైన సివిల్ సర్వీస్ ఉద్యోగుల తొలగింపునకు తమ సాంకేతిక నైపుణ్యాలను వినియోగించుకోలేమని స్పష్టం చేశారు. మూకుమ్మడిగా ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, ప్రొడక్ట్ మేనేజర్లు ఇలా రాజీనామా చేయడం మస్క్ తోపాటు అధ్యక్షుడు ట్రంప్ నకు షాకేనని భావిస్తున్నారు. మేం అమెరికన్ ప్రజలకు సేవ చేస్తామని ప్రతిజ్ణ చేశాం. అధ్యక్ష పాలనా వ్యవస్థలో రాజ్యాంగ విలువలను నిలబెడతామని ప్రమాదం చేశామని సంయుక్త రాజీనామా లేఖలో ఉద్యోగులు పేర్కొన్నారు. ఫెడరల్ ప్రభుత్వ సైజును తగ్గించేందుకు మస్క్ ఆధ్వర్యంలో ఏర్పాటైన డోజ్ లో రాజకీయ ఉద్దేశాలున్నవారే అధికంగా ఉన్నారని, లక్ష్య సాధనలో వారికి నైపుణ్యంగానీ, అనుభవం గానీ లేవంటూ ఆరోపించారు.

అధికారంలోకి రాగానే ట్రంప్ ఏర్పాటు చేసిన ఎలాన్ మస్క్ నేత్రుత్వంలోని డోజ్ రద్దు చేసి కాంట్రాక్టులో 40శాతం నిరుపయోగమేనని తేలింది. వాటివల్ల ఖజానాకు నిధులు ఆదా అయ్యేదేమీ లేదని వెల్లడి అయ్యింది. గతవారం నాటికి 1,125 కాంట్రాక్టులను డోజ్ రద్దు చేసింది. వాటిలో 417 కాంట్రాక్టుల రద్దు వల్ల ప్రయోజనం లేదని తేలింది. ఇప్పటికే పూర్తిగా నిధులను ఖర్చు చేయడం దీనికి కారణం అని వెల్లడైంది. 

Tags:    

Similar News