లండన్ సౌత్ ఎండ్‌లో కూలిన B200 Super King Air విమానం: కారణాలు, వివరాలు ఇవే

లండన్ సౌతెండ్ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే బీచ్ B200 సూపర్ కింగ్ ఎయిర్ విమానం కుప్పకూలింది. నెదర్లాండ్స్ వెళ్తున్న ఈ విమానం ప్రమాదానికి కారణాలు, ఫీచర్లు, అధికారుల స్పందన పూర్తివివరాలతో తెలుసుకోండి.

Update: 2025-07-14 09:09 GMT

Beechcraft B200 Super King Air Crashes at London Southend: Causes and Details Revealed

లండన్‌లో విమాన ప్రమాదం: B200 సూపర్ కింగ్ ఎయిర్ జెట్ టేకాఫ్ కాగానే కూలింది

లండన్ సౌతెండ్ విమానాశ్రయంలో ఆదివారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సాయంత్రం 4 గంటల సమయంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే బీచ్ B200 Super King Air చిన్న ప్యాసింజర్ జెట్ విమానం కుప్పకూలింది.

ఈ విమానం నెదర్లాండ్స్ (Netherlands) వైపు ప్రయాణం ప్రారంభించిన కొద్ది క్షణాలకే భూమికి గమ్యమైంది. ప్రమాదం జరిగిన వెంటనే భారీ మంటలు చెలరేగడంతో ఎసెక్స్ ప్రాంతమంతా పొగలతో కమ్ముకుని స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేసింది.

B200 Super King Air – ప్రత్యేకతలు ఏంటి?

Beechcraft B200 Super King Air అనేది రెండు శక్తివంతమైన టర్బోప్రాప్ ఇంజిన్లతో నడిచే మల్టీ-యుటిలిటీ విమానం. దీనిని వ్యాపార, వైద్య, ప్రభుత్వ అవసరాల కోసం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తారు.

ప్రధాన లక్షణాలు:

  • 9 మంది ప్రయాణికులు, 2 మంది సిబ్బంది సామర్థ్యం
  • రెక్కల వెడల్పు: 57 అడుగులు
  • గరిష్ట వేగం: 278 నాట్స్ (సుమారు 515 కిమీ/గంట)
  • గరిష్ట ఎత్తు: 35,000 అడుగులు
  • టేకాఫ్ బరువు: 12,500 పౌండ్లు (5,670 కిలోలు)
  • శక్తివంతమైన టర్బో ఇంజిన్‌లు, మెరుగైన ఇంధన సామర్థ్యం
  • "T-Tail" డిజైన్‌తో వస్తుంది

ఎసెక్స్ అధికారులు స్పందన:

ఈ ఘటనపై ఎసెక్స్ అధికారులు స్పందించారు. "సాయంత్రం 4 గంటలకు ముందు 12 మీటర్ల పొడవున్న విమానం కూలిపోయిన సమాచారం మాకు అందింది. ప్రస్తుతం సంఘటనా స్థలంలో అత్యవసర సేవల బృందాలు పని చేస్తున్నాయి. ఈ రక్షణ చర్యలు ఇంకా కొన్ని గంటల పాటు కొనసాగుతాయి. ప్రజలు ఈ ప్రాంతానికి దూరంగా ఉండాలి" అని వారు పేర్కొన్నారు.

ఇది రెండో ప్రమాదం..!

బ్యూరో ఆఫ్ ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ ఆర్కైవ్స్ ప్రకారం, ఇదే Southend విమానాశ్రయంలో 1987 సెప్టెంబర్ 12న ఇలాంటి మరో B200 విమానం కూలిపోయింది. ఆ ప్రమాదంలో పైలట్ మాత్రమే ఉన్నారు.

Tags:    

Similar News