ఆస్ట్రేలియా కఠిన నిర్ణయం..ఇండియాలో ఉండి వస్తే 5 ఏళ్లు జైలు

Australia: మే 15 వరకు ఇండియా నుంచి వచ్చే విమానాలపై నిషేధం

Update: 2021-05-01 06:13 GMT

ఆస్ట్రేలియా ఎయిర్ పోర్ట్ ఫైల్ ఫోటో 

Australia: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే మన దేశంలో ఉంటున్న తమ పౌరులు తక్షణమే రావాలని అమెరికా సూచించింది. తాజాగా.. ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో కరోనా ఉగ్రరూపం కొనసాగుతున్న వేళ.. ఇక్కడి నుంచి తమ దేశానికి వెళ్లే ఆస్ట్రేలియన్లపై తాత్కాలికంగా నిషేధం విధించింది. ఇండియాలో ఉన్న ఆస్ట్రేలియన్లు తమ దేశంలోకి అడుగు పెడితే ఐదేళ్ల పాటు జైలు శిక్షతో పాటు.. 66వేల డాలర్లు అంటే ఇండియా కరెన్సీలో దాదాపు 49 లక్షల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

బయో సెక్యూరిటీ యాక్ట్‌ చట్టం కింద ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. భారత్‌లో సుమారు 9వేల మంది ఆస్ట్రేలియన్లు నివసిస్తున్నారని, వాళ్లలో దాదాపు ఆరు వందల మందికి కరోనా సోకే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియా చెబుతోంది. మరోవైపు.. విమాన రాకపోకలపై నిషేధాన్ని పొడిగించింది ఆస్ట్రేలియా. మే 15 వరకు ఇండియా నుంచి వచ్చే విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

అయితే భారత్‌లో జరుగుతున్న ఐపీఎల్‌లో ఆసీస్‌ క్రికెటర్లు ఇప్పటికే పాల్గొంటున్నారు. దీనిపై దృష్టిపెట్టిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ఐపీఎల్‌ ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు, శిక్షణా సిబ్బందికి ఈ నిబంధన నుంచి సడలింపు ఇచ్చే ఆలోచనలో ఉంది.

Tags:    

Similar News