ట్రక్కులో 42 మృతదేహాలు.. రైలు పట్టాల పక్కన నిలిపి ఉన్న ట్రక్కు

*ట్రక్ డోర్‌ను తెరిచిచూడటంతో గుట్టలుగా బయటపడ్డ శవాలు

Update: 2022-06-28 05:18 GMT

ట్రక్కులో 42 మృతదేహాలు.. రైలు పట్టాల పక్కన నిలిపి ఉన్న ట్రక్కు

Texas: అమెరికాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ప్రజలు అక్కడ గన్ కల్చర్‌లో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. ఈ క్రమంలో మరో దారుణమైన ఘటన వెలుగులోనికి వచ్చింది. టెక్సాస్ రాష్ట్రంలోని శాన్ ఆంటోనియోలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న రైలు పట్టాల పక్కన ఒక ట్రక్‌ను గుర్తించారు. అక్కడికి వెళ్లి చూసే సరికి దానిలో అనేక శవాలు ఉన్నాయి. కనీసం 40 మందికి పైగా చనిపోయి కనిపించారని అధికారులు తెలిపారు.

శాన్ ఆంటోనియో నగరం దక్షిణ శివార్లలోని మారుమూల ప్రాంతంలో రైలు పట్టాల పక్కనే ఓ ట్రక్కు నిలిపివేసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అనుమానాస్పదంగా ఉన్న ట్రక్కు డోర్‌ను తెరిచిచూడగా అందులో దాదాపు 42 మంది చనిపోయి ఉన్నారు. పలువురు ట్రక్కులు సజీవంగా ఉన్నవారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మెక్సికన్ సరిహద్దు నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాన్ ఆంటోనియోలో సోమవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక తేమతో 39.4 డిగ్రీల సెల్సియస్ వరకు టెంపరేచర్‌ పెరిగింది. దీంతో, వలసదారులు ట్రక్కులో మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మెక్సికో నుంచి అమెరికాకు అక్రమ వలసదారులు ఎక్కువ సంఖ్యలో ట్రక్కుల్లో వెళ్తుంటారు. అంతకు ముందు కూడా వలసదారులతో వెళ్తున్న మెక్సికోకు చెందిన ట్రక్కులు ప్రమాదానికి గురి కావడంతో పదుల సంఖ్యలో మెక్సికన్లు మృతిచెందారు. 

Tags:    

Similar News