Barack And Michelle Obama: ఒబామా, మిచెల్ దంపతులు విడిపోతున్నారా?

Barack And Michelle Obama: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులకు సంబంధించిన వార్త ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Update: 2025-01-17 10:26 GMT

Barack And Michelle Obama: ఒబామా, మిచెల్ దంపతులు విడిపోతున్నారా?

Barack And Michelle Obama: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులకు సంబంధించిన వార్త ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కుటుంబ జీవితానికి ప్రాధాన్యతనిస్తూ.. ఎంతో అన్యోన్యంగా ఉండే ఒబామా దంపతులు మోస్ట్ పాపులర్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వీరు విడిపోతున్నారంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అసలు ఒబామా దంపతుల విడాకుల వార్తలకు కారణాలు ఏంటనేది ఇప్పడు చర్చకు దారి తీస్తోంది.

బరాక్ ఒబామా రెండు సార్లు అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో అమెరికా ప్రథమ పౌరురాలిగా మిచెల్ చాలా ఉత్సాహంగా ఉండేవారు. ఎక్కడికి వెళ్లినా ఒబామాకు తోడుగా వెళ్లేవారు. చాలా అన్యోన్యంగా ఉండేవారు అలాంటి వీరిద్దరూ విడిపోతున్నారన్న వార్తలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నట్టు ప్రస్తుతం ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నెల 20వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బరాక్ ఒబామా రావడం లేదని తెలుస్తోంది. ఆయన సతీమణి మిచెల్ ఒబామా కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటారని అమెరికన్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో ఒబామా దంపతులు మధ్య మనస్పర్ధలు వచ్చాయని.. అందుకే ట్రంప్ ప్రమాణస్వీకారానికి మిచెల్ హాజరు కావడంలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

గత కొన్ని రోజుల క్రితం అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియల కార్యక్రమానికి కూడా మిచెల్ ఒబామా హాజరుకాకపోవడం మొదటిసారిసారి అనుమానాలకు దారి తీసింది. ఈ క్రమంలోనే ఒబామా దంపతులు విడాకులకు సంబంధించి సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బరాక్ రాసిన 'ఏ ప్రామిస్డ్ ల్యాండ్' అనే పుస్తకంలో కూడా తమ దాంపత్యంలో పలు ఇబ్బందికరమైన పరిణామాలు ఎదుర్కున్నట్లు చెప్పడం గమనార్హం. అంతేకాదు తమ వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్దలు ఎదురయ్యాయని.. వాటిని అధిగమించేందుకు తాము కౌన్సెలింగ్ తీసుకున్నట్టు ఆ మధ్య మిచెల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్టు తెలుస్తోంది.

ఇప్పుడు ఆ చిన్న చిన్న మనస్పర్థలే.. పెద్దగా మారాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవే ఇప్పుడు వారు దూరం అయ్యేందుకు కారణమా? అందుకే ఏ కార్యక్రమానికైనా జంటగా వచ్చే ఒబామా దంపతులు.. ఇప్పుడు ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవాన్ని స్కిప్ చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొందరు మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నారు.

కాగా.. మిచెల్, ఒబామాది ప్రేమ వివాహం. ఒబామా హార్వర్డ్ లా స్కూల్లో సమ్మర్ ఇంటర్న్‌గా చేరిన సమయంలో మిచెల్‌తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో పెళ్లంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని ఒబామా నిర్ణయించుకున్నారంట. మిచెల్ మనసులో తనపై ఉన్న ఫీలింగ్ ఏంటో తెలుసుకోవాలనుకున్న ఒబామా.. ఇద్దరూ తరచూ వెళ్లే రెస్టారెంట్‌లో ప్రత్యేక సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. ట్రేలో ఉంగరాన్ని ఉంచి ప్రేమ ప్రతిపాదన చేశారంట ఒబామా. అలా మిచెల్ వెంటనే ఓకే చెప్పగా 1991లో నిశ్చితార్థం చేసుకున్నారు ఈ జంట. 1992లో పెళ్లి కూడా చేసుకున్నారు. ఒబామా-మిచెల్ వివాహ బంధానికి గుర్తుగా సాషా, మలియా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Tags:    

Similar News