American Airlines: విమానంలో మరో మూత్ర విసర్జన ఘటన

American Airlines: మద్యం మత్తులో విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన

Update: 2023-03-05 09:00 GMT

American Airlines: విమానంలో మరో మూత్ర విసర్జన ఘటన 

American Airlines: ఎయిర్ ఇండియా విమానంలో మూత్ర విసర్జన ఘటన మరకముందే మరో మూత్ర విసర్జన ఘటన చోటు చేసుకుంది. న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ వ్యక్తి పక్కనే ఉన్న మరో ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేయడం కలకలం రేపింది. AA 292 నెంబర్ విమానం శుక్రవారం న్యూయార్క్ నుంచి బయలుదేరింది. అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థి మద్యం మత్తులో నిద్రలో ఉన్న సమయంలో మూత్రం పోశాడు. ఆ మూత్రం పక్కనే ఉన్న తనపై పడ్డట్టు తోటి ప్రయాణికుడు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. విమాన సిబ్బంది పైలెట్ ద్వారా ఢిల్లీ ఇందిరాగాంధీ విమానాశ్రయంలోని ఏటీసీకి తెలియజేశారు. విమానం ల్యాండ్ కాగానే నిందితుడిని సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఇరుపక్షాల వాదనలు నమోదు చేసి కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

Tags:    

Similar News