Barack Obama: ఒక్క ఫొటోతో విడాకుల వార్తలకు చెక్ పెట్టిన ఒబామా..!

Barack Obama: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇస్తూ ఎంతో అన్యోన్యంగా ఉండడంతో పాటు మోస్ట్ పాపులర్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.

Update: 2025-01-18 10:31 GMT

Barack Obama: ఒక్క ఫొటోతో విడాకుల వార్తలకు చెక్ పెట్టిన ఒబామా..!

Barack Obama: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇస్తూ ఎంతో అన్యోన్యంగా ఉండడంతో పాటు మోస్ట్ పాపులర్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ జంట విడిపోతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ వార్తలకు ఒక్క ఫొటోతో చెక్ పెట్టారు ఒబామా. శుక్రవారం మిచెల్ బర్త్ డే కావడంతో ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.

తన జీవితాన్ని ప్రేమతో నింపిన తన ప్రేయసి మిచెల్ ఒబామాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. తన జీవితాన్ని నాలెడ్జ్‌తో, హాస్యంతో నింపావు. ఇలా చేయడంతో ఇంకా బాగున్నావు. నీతో జీవితం సాహసాలు చేయడంలో భాగమైనందుకు తాను అదృష్టవంతుడిని అంటూ బరాక్ ఒబామా రాసుకొచ్చారు.

ఒబామా దంపతులు విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మృతిచెందగా అతడి అంత్యక్రియలకు ఒబామా ఒక్కరే హాజరయ్యారు. మిచెల్ మాత్రం ఈ అంత్యక్రియల్లో పాల్గొనలేదు. అలాగే ఇటీవల అమెరికా ఎన్నికల్లో విజయం సాధించి రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి కూడా మిచెల్ హాజరుకావడంలేదని.. ఒబామా ఒక్కరే పాల్గొనబోతున్నట్టు వార్తలు వినిపించాయి.

ఎప్పుడూ భర్తతో కలిసి కనిపించే మిచెల్ ఈ మధ్య ఒబామాతో కలిపించడంలేదు. సతీమణి లేకుండానే ఒబామా ఒంటరిగా పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. దీంతో అందరూ వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్టు భావించారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఒక్క ఫొటోతో ఈ వార్తలకు చెక్ పెట్టారు ఒబామా.

మరోవైపు విడాకుల వార్తలపై మిచెల్ టీం కూడా స్పందించింది. విడాకులు తీసుకోనున్నారని వస్తున్న వార్తలు అబద్ధం అని వెల్లడించింది. ఇలాంటి ఫేక్ వార్తలను వ్యాప్తి చేయకండి అంటూ పేర్కొంది. బరాక్ ఒబామా మిచెల్ దంపతులు 1992లో పెళ్లి చేసుకున్నారు. వీరికి సాషా, మలియా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.


Tags:    

Similar News