Joe Biden: అప్ఘాన్ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రసంగం

Joe Biden: అప్ఘాన్‌లో తాజా పరిస్థితులను పరిశీలిస్తున్నాం: జోబైడెన్ * తాలిబన్లపై అప్ఘాన్ ప్రభుత్వం పోరాడలేదు

Update: 2021-08-17 03:00 GMT
ఆఫ్ఫ్గానిస్థాన్ సంక్షోభం పై స్పందించిన జో బిడెన్ (ఫైల్ ఇమేజ్)

Joe Biden: అప్ఘానిస్తాన్ ప్రభుత్వానికి తాము మద్ధతు ఇచ్చినా ఉపయోగించుకోలేదని అమెరికా అధ్యక్షుడుజో బైడెన్ అన్నారు. అప్ఘాన్ సంక్షోభంపై ఆయన ప్రసంగించారు. ఆ దేశంలో తాజా పరిస్థితులను పరిశీలిస్తున్నామన్నారు. తాలిబన్లపై అప్ఘాన్ ప్రభుత్వం అసలు పోరాడలేదన్నారు. చేతులు కట్టుకుని పాలనను వారికి అందించినందని మండిపడ్డారు.

అయితే ప్రస్తుత పరిస్థితులకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలే కారణమని అధ్యక్షుడు జో బైడెన్ విమర్శించారు. అప్ఘాన్ సంక్షోభానికి ట్రంప్ వైఖరే కారణమన్నారు. తీవ్రవాదానికి తాము ఎప్పుడూ వ్యతిరేకమని మరోసారి స్పష్టం చేశారు. అప్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ చేసింది ముమ్మటికి తప్పేనని జో బైడెన్ అన్నారు. అప్ఘాన్‌లో నాలుగు పర్యటించానని గుర్తు చేశారు. ఆ దేశం వల్ల ఇప్పటివరకు అమెరికా సైన్యానికే తీవ్ర నష్టం జరిగింది. భవిష్యత్‌లో అమెరికాకు ఏది మంచిదో దానిపైనే దృష్టి పెడతానన్నారు. 

Tags:    

Similar News