అల్లర్లు అదుపులోకి రావట్లేదు.. ఇక సైన్యాన్ని దింపుతాను: డొనాల్డ్ ట్రంప్

Update: 2020-06-02 08:33 GMT
Donald Trump (File Photo)

అమెరికా పోలీసుల చేతిలో నల్లజాతి వ్యక్తి జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. అందుకు నిరసనగా హింసాత్మక ఘటనలు విధ్వంసాలు చోటు చేసుకున్నాయి. దీంతో అధికారులు ఎంత ప్రయత్నించినా అల్లర్లు అదుపులోకి రాకపోతుండడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సాయుధ బలగాలను భారీగా రంగంలోకి దించుతానని హెచ్చరించారు. నేషనల్‌ గార్డ్స్‌ను రాష్ట్రాల్లోకి అనుమతించాలని లేని పక్షంలో సైన్యాన్ని రంగంలోకి దింపుతానని చెప్పారు. అల్లర్ల విషయంలో గవర్నర్లు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.

ట్రంప్ నిన్న రాష్ట్రాల గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడి, నిరసనకు దిగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. శాంతి, భద్రతలను కాపాడడం తన ప్రథమ కర్తవ్యమని తెలిపారు. అమెరికా ప్రజలు ఇప్పటివరకు ఎన్నడూ చూడని విధంగా చర్యలు తీసుకోబోతున్నామని హెచ్చరించారు. అల్లర్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని వారిని పదేళ్లపాటు జైల్లో పెట్టాలని, అలా చేస్తేనే ఇటువంటి ఘటనలు మరోసారి జరగవని చెప్పుకొచ్చారు.


Tags:    

Similar News