Donald Trump: రెండోసారి ట్రంప్‌కి కరోనా పరీక్షలు

కరోనా వైరస్ ప్రభావంతో అగ్రరాజ్యం అమెరికా గజగజలాడుతుంది. ఇప్పటికే రోజుకు సగటున 20వేల మందికిపైగా ఈ మహమ్మారి బారినపడుతున్నారు.

Update: 2020-04-03 07:58 GMT

కరోనా వైరస్ ప్రభావంతో అగ్రరాజ్యం అమెరికా గజగజలాడుతుంది. ఇప్పటికే రోజుకు సగటున 20వేల మందికిపైగా ఈ మహమ్మారి బారినపడుతున్నారు.బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 884మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో కరోనా వైరస్‌తో మరణించిన వారిసంఖ్య 5,093కు చేరింది. ఈ నేపద్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్ ట్రంప్ కి రెండోసారి కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

ఈ రోజు ఉదయాన్నే రిపోర్ట్‌ తీసుకున్నానని, అందులో కోవిడ్‌-19 నెగెటివ్‌ గా వచ్చిందని అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా ట్రంప్‌ వ్యక్తిగత వైద్యుడు సీన్‌ పి కాన్‌లీ వెల్లడించారు. కేవలం 15 నిమిషాల్లోనే రిపోర్టు వచ్చిందని వెల్లడించాడు.

ట్రంప్‌ కు మొదటిసారి మార్చి నెల రెండోవారంలో పరీక్ష నిర్వహించారు. ఇన్వాసివ్‌ పద్దతిలో జరిపిన పరీక్షలో ఫలితం రావడానికి పలు గంటలు పట్టింది. కానీ రెండో సారి ర్యాపిడ్‌ విధానంలో పరీక్ష చేయగా, కేవలం 15 నిమిషాల్లోనే రిపోర్టు వచ్చింది. లాక్ డౌన్ విధించినప్పటికి రోజురోజుకి మరణాల సంఖ్య పెరగడం తనను తీవ్రంగా కలచివేస్తోందని ట్రంప్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ అమెరికన్లు ఇలాంటి పరిస్థితిని చూడలేదని అయన అన్నారు.  

Tags:    

Similar News