అమెరికాలో పరిస్థితి దయానీయం..లక్ష మృతదేహాల సంచులకు ఆర్డర్‌!

Update: 2020-04-03 10:33 GMT

అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. లక్షలు దాటుతున్న కరోనా కేసులు, రోజుకు వేల సంఖ్యలో మరణాలు ఇదీ ప్రస్తుతం అమెరికా ఎదుర్కుంటోన్న పరిస్థితి. రోజుకు వేల కొద్దీ కేసులు వస్తుండటంతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటికే అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 6 వేలు దాటింది. 24 గంటల్లోనే 11 వందలకు పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. వైట్‌హౌస్‌ విశ్లేషకులైతే లక్ష నుంచి రెండున్నర లక్షల మంది అమెరికన్లు కరోనాకు బలవుతారని అంచనా వేస్తున్నారు.

తాజాగా, అమెరికా ప్రభుత్వానికి సంబంధించి ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. మృతదేహాలను ఉంచేందుకు లక్ష బాడీ బ్యాగులు కావాలంటూ ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ (ఫెమా) అమెరికా సైనిక విభాగాన్ని కోరడం తీవ్ర కలకలం రేపుతోంది. పెంటగాన్ వర్గాలు కూడా దీన్ని ధ్రువీకరించాయి.






Tags:    

Similar News