Corona vaccinated: టీకా తీసుకో.. బీరు పట్టుకో..!
Corona vaccinated: కరోనా వైరస్ కు అడ్డుకట్ట వేయడానికి పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి
Corona vaccine (The hans india)
Corona vaccinated: భారత్ లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తుంది. కరోనా వైరస్ కు అడ్డుకట్ట వేయడానికి పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సినేష్ ప్రక్రియ కూడా వేగవంతం చేస్తున్నాయి. అయినా దేశంలో వ్యాక్సిన్ల కొరతతో 18-45 ఏళ్లలోపు వారికి ఇప్పటికీ టీకాలు వేయడం లేదు. అయితే అమెరికాలో మాత్రం ధీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది.
అమెరికా ప్రభుత్వం అక్కడి ప్రజలను వ్యాక్సిన్లను తీసుకోమని ఎంతలా ప్రాధేయపడుతున్నా అమెరికన్లు మాత్రం వ్యాక్సిన్లు వేసుకోవడానికి అస్సలు ముందుకు రావడం లేదట..దీంతో అమెరికాలో వ్యాక్సిన్ తీసుకోవడాన్ని ప్రోత్సహించేందుకు రకరకాల ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా ప్రభుత్వం ముందస్తుగానే వ్యాక్సిన్ తయారీ దశలోనే కంపెనీలకు బిలియన్ డాలర్లు సొమ్మును ఇచ్చి దేశ ప్రజల కోసం వ్యాక్సిన్లను విరివిగా సేకరించింది. ఇతర దేశాలకు ఎగుమతులు నిషేధించి మరీ మిలియన్ల డోసుల వ్యాక్సిన్ ను అమెరికా ప్రభుత్వం అట్టిపెట్టుకుంది.
ఈ క్రమంలోనే డ్రింక్స్ తయారు చేసే అన్ హైజర్ అనే సంస్థ.. 21 ఏళ్లు పైబడిన యువతను దృష్టిలో ఉంచుకొని కొత్త ఆఫర్ ప్రకటించింది. టీకా వేయించుకొని తమ వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకునే తొలి 2 లక్షల మందికి ఒక్కొక్కరికి 5 డాలర్ల విలువైన బీర్ ను ఉచితంగా అందిస్తామని సంస్థ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇక దీంతోనైన అక్కడి ప్రజలు వ్యాక్సిన్ కోసం ముందుకు వస్తారేమో చూడాలి.