Monkeypox: అమెరికాలో మొదటి మంకీపాక్స్ కేసు నిర్ధారణ

Monkeypox: ఇటీవల కెనడాకు వెళ్లిన వ్యక్తిలో వ్యాధి లక్షణాలు

Update: 2022-05-19 06:35 GMT

అమెరికాలో మొదటి మంకీపాక్స్ కేసు నిర్ధారణ

Monkeypox: కరోనా బారి నుంచి కోలుకుంటున్న ప్రపంచానికి ఇంకా ఆ పీడ విరగడ కాకముందే మరికొన్ని ప్రమాదకర రోగాలు దండయాత్ర చేస్తున్నాయ్. కొత్తకొత్త వ్యాధులు ప్రపంచదేశాలను వణికిస్తున్నాయ్. యూరప్ దేశాలను కలవరపెడుతున్న మంకీపాక్స్ కేసు తాజాగా అమెరికాలోనూ వెలుగు చూసింది. అమెరికాలో మొదటి మంకీపాక్స్ కేసును అక్కడి వైద్యులు నిర్ధారించారు. ఇటీవల కెనడాకు వెళ్లిన వ్యక్తిలో వ్యాధి లక్షణాలు వైద్యులు గుర్తించారు. ఇప్పటికే యూరోపియన్‌లో భారీగా కేసులు వెలుగుచూస్తున్నాయ్.

కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్‌లోని మంకీపాక్స్ టెన్షన్ తో ఆ దేశం ఆందోళన చెందుతోంది. డజనుకుపైగా అనుమానాస్పద కేసులను అక్కడ అధికారులు గుర్తించారు. బాధితులు ఫ్లూ సింప్టమ్స్‌తో ఆస్పత్రులకు వస్తున్నారు. జ్వరం, కండరాల నొప్పు, తలనొప్పి, కణుపుల వాపు లక్షణాలు కూడా మంకీపాక్స్ సోకినవారిలో ఉంటున్నాయ్. స్మాల్ పాక్స్ తరహాలోనే వంటిపై రాషెస్ తో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరైనా ఆ ర్యాషెస్ తాకడంతో వారికి కూడా మంకీ పాక్స్ వచ్చే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు.

మంకీ పాక్స్ అసాధారణమైన లైంగిక నెట్‌వర్క్‌లతో వ్యాప్తి చెందుతున్నా సెక్స్ రిలేషన్ లేకుండా మంకీపాక్స్ వ్యాప్తి చెందడాన్ని వైద్యులు గుర్తించారు. మే 6 నుండి యూకేలో 9, స్పెయిన్, పోర్చుగల్‌లో కూడా 40 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయ్. ఐతే మంకీపాక్స్‌తో భయపడాల్సిన పనిలేదని వైద్యులు అంటున్నారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నవారికి ఎవరికి కూడా ప్రాణాపాయం లేదంటున్నారు. పోర్చుగల్, స్పెయిన్, బ్రిటన్‌లలో గత రెండు వారాలుగా కేసులు నమోదవుతుండటంతో ఆ దేశాల్లో ఆందోళన నెలకొంది. 

Tags:    

Similar News