Alcohol: ఏ వైన్ తాగినా క్యాన్సర్ ముప్పు.. పరిశోధనల్లో వెల్లడి

Red Wine vs White Wine: రెడ్ వైన్, వైట్ వైన్ ఏది తాగినా క్యాన్సర్ ముప్పు ఉందని అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం తేల్చింది.

Update: 2025-03-24 06:13 GMT

Alcohol: ఏ వైన్ తాగినా క్యాన్సర్ ముప్పు.. పరిశోధనల్లో వెల్లడి

Red Wine vs White Wine: రెడ్ వైన్, వైట్ వైన్ ఏది తాగినా క్యాన్సర్ ముప్పు ఉందని అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం తేల్చింది. 42 అధ్యయనాల డేటాను విశ్లేషించిన తర్వాత ఈ విషయాన్ని తేల్చారు. రెడ్, వైట్ వైన్లలో ఏది కూడా సురక్షితం కాదని పరిశోధనలు చెబుతున్నాయి.

రెడ్ వైన్‌లో రెస్‌వెరట్రాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని....వీటితో ఆరోగ్యానికి నష్టమని నిపుణులు చెబుతున్నారు. రెడ్ వైన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని తమకు ఆధారాలు లేవని లభ్యం కాలేదని బ్రౌన్ యూనివర్శిటీ కి చెందిన డాక్టర్ యున్ యంగ్ చో అన్నారు.

వైట్ వైన్‌తో మహిళల్లో క్యాన్సర్ ప్రమాదం

వైట్ వైన్ తో మహిళల్లో క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధనల్లో తేలింది. చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని వైట్ వైన్ 22 శాతం పెంచే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆయా వ్యక్తుల జీవనశైలి అంశాలు కూడా క్యాన్సర్‌పై ప్రభావం చూపనున్నాయి. అప్పటికే కొందరిలో ఉన్న క్యాన్సర్ కారకాలు వైట్ వైన్ తో ఇది మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. అయితే రెడ్ వైన్ తో ఈ ప్రమాద పెరుగుదల వైట్ వైన్ తో పోలిస్తే అంతగా లేదంటున్నారు.ప్రతి రోజూ రెడ్ వైన్ తాగడం వల్ల క్యాన్సర్ ప్రమాదం 5 శాతం పెరుగుతందని పరిశోధనలు తేల్చాయి. ఆల్కహాలు ఏ రూపంలో ఉన్నా కూడా అది ప్రమాదమేనని ఈ అధ్యయనంలో పాల్గొన్న డాక్టర్ బ్రియాన్ చెప్పారు.

Tags:    

Similar News