Sri Lanka: అధ్యక్ష నివాసానికి లంకన్ల భారీ క్యూ
Sri Lanka: గంటల తరబడి కిలోమీటర్ల మేర జనం బారులు
Sri Lanka: అధ్యక్ష నివాసానికి లంకన్ల భారీ క్యూ
Sri Lanka: శ్రీలంకలో అధ్యక్ష నివాసాన్ని చూసేందుకు వేలాది మంది ప్రజలు తరలిస్తున్నారు. లంకలో ఎండలు మండుతున్నా ప్రజలు లెక్కచేయకుండా గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నారు. అధ్యక్ష నివాసానికి వచ్చి సెల్ఫీలతో సరదాగా గడుపుతున్నారు. దేశ వాణిజ్య రాజధాని కొలంబోలోని అద్యక్ష నివాసం ఇప్పుడు వారికి పర్యాటక ప్రాంతంలా మారిపోయింది. భవనంలోని సిమ్మింగ్ పూల్, జిమ్, బెడ్‌రూమ్‌లు, బంకర్లను, అక్కడి సౌకర్యాలను చూసి ఆశ్చర్యపోతున్నారు.
భనవంలోని అన్ని గదులను చూసి.. అక్కడ సరదాగా గడిపి వెళ్తున్నారు. రెండ్రోజుల నుంచి అధ్యక్ష నివాస భవనంలోని దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడంతో.. భారీగా ప్రజలు చూసేందుకు తరలిస్తున్నారు. మరోవైపు అక్కడున్న ఆందోళనకారులు.. అక్కడి పారిశుధ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తున్నారు.