Indonesia: ఎయిరిండియాను వదలని ప్రకృతి.. ఇండోనేషియనాలో అగ్నిపర్వతం బద్దలు

Indonesia: తూర్పు ఇండోనేషియాలోని లెవోటోబి లకి-లకి అగ్నిపర్వతం బద్దలవ్వడంతో దానికి సమీపంలో బాలికి వెళ్లే ఎయిరిండియా విమానాన్ని వెనక్కి మళ్లించారు.

Update: 2025-06-18 06:08 GMT

Indonesia: ఎయిరిండియాను వదలని ప్రకృతి.. ఇండోనేషియనాలో అగ్నిపర్వతం బద్దలు

Indonesia: తూర్పు ఇండోనేషియాలోని లెవోటోబి లకి-లకి అగ్నిపర్వతం బద్దలవ్వడంతో దానికి సమీపంలో బాలికి వెళ్లే ఎయిరిండియా విమానాన్ని వెనక్కి మళ్లించారు. అక్కడి నుంచి తిరుగుపయనమైన విమానం బుధవారం ఢిల్లీకి సురక్షితంగా చేరినట్లు అధికారులు తెలిపారు. దీంతో భారత్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి బాలికి వచ్చే పలు అంతర్జాతీయ విమానాలను రద్దు చేసినట్లు తెలిపారు. అగ్నిపర్వతం విస్పోటనం కారణంగా ప్రయాణికుల భద్రతను ద్రుష్టిలో ఉంచుకుని..తూర్పు ఇండోనేషియాలోని నొసా టెంగారా ప్రావిన్స్ లోని ఎయిర్ పోర్టును మూసివేసినట్లు వెల్లడించారు.

తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్ లోని లెవోటోబి లకి-లకి పర్వతం మంగళవారం విస్పోటనం చెందింది. దాదాపు 11కిలోమీటర్ల ఎత్తులో బూడిద ఎగసిపడినట్లు వోల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్ మిటిగేషన్ అధికారులు వెల్లడించారు. బుధవారం ఉదయం అగ్నిపర్వతంలో మళ్లీ విస్పోటనం సంభవించడంతో కిలోమీటర్ ఎత్తులో దట్టమైన బూడిద ఎగిసిపడుతున్నట్లు తెలిపారు. ఈ విస్పోటనం కారణంగా అగ్నిపర్వతానికి ఆనుకోని ఉన్న సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు స్థానిక విపత్తు నిర్వహణ సంస్థ అధికారి అవీ హల్లన్ పేర్కొన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మాస్కులు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చివరిసారిగా ఈ ఏడాది మేలో లకిలకి అగ్నిపర్వతం పలుమార్లు బద్దలయ్యిందని తెలిపారు. 



Tags:    

Similar News