Turkey Floods: టర్కీలో భారీ వరదలు
Turkey Floods: వరదల్లో 77 మంది దుర్మరణం * ప్రావిన్స్‌లో కుండపోత వర్షాలతో వరదలు
టర్కీలో భారీ వరదలు (ఫైల్ ఇమాజ్)
Turkey Floods: టర్కీలోని నల్ల సముద్రతీరంలో సంభవించిన వరదల్లో 77 మంది దుర్మరణం చెందారు. వాయువ్య నల్ల సముద్రం ప్రావిన్స్‌లో కురిసిన కుండపోత వర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. వరదనీటి ధాటికి పలు ఇళ్లు, వంతెన కుప్పకూలిపోయాయి. వరదనీటిలో కార్లు కొట్టుకుపోయాయి. కాస్టామోను ప్రావిన్స్‌లో 62 మంది మరణించారు. సినోప్‌లో 14 మంది, బార్టిన్‌లో ఒకరు మరణించారని టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు చెప్పారు. కాస్టామోను, సినోప్ ప్రాంతాల్లో పలువురు గల్లంతయ్యారు.