Earthquake: భారీ భూకంపంతో ఉలిక్కిపడిన పెరూ

Earthquake: రిక్టర్ స్కేల్‌పై 7.5 తీవ్రతతో ప్రకంపనలు

Update: 2021-11-28 15:48 GMT
పేరు దేశంలో భారీ భూకంపం (ఫైల్ ఇమేజ్)

Earthquake: భారీ భూకంపంతో పెరూ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రిక్టర్ స్కేల్‌పై 7.5 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. నార్త్ బరాన్కాకు 36 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భారీ భూకంప ధాటికి భవనాలు ఊగిపోవడంతో, జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే, భూకంపం తీవ్రత ఎక్కువగానే ఉన్నప్పటికీ లోతు కూడా అధికంగా ఉండటం వల్ల భారీగా ప్రాణ, ఆస్తి నష్టం కలగలేదు. భూకంపం ధాటికి 16వ శతాబ్దానికి చెందిన ఓ పాత కాథోలిక్​ఆలయ టవర్​కూలిపోయింది. ఇతర ప్రాంతాల్లో కొన్ని చర్చిలు ధ్వంసమయ్యాయి. 

Tags:    

Similar News