ఇండోనేషియాలో భారీ భూకంపం

-రిక్టర్ స్కేల్ పై 7.1 తీవ్రత నమోదు -సునామీ హెచ్చరిక జారీ చేసిన అధికారులు -సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిన ప్రజలు

Update: 2019-11-15 02:13 GMT
Earthquake Hits Indonesia's North Maluku Coast

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.1 తీవ్రత నమోదయ్యింది. టర్నేట్ పట్టణానికి వాయువ్య దిశలో 139 కిలో మీటర్ల దూరంలో 45 కిలో మీటర్ల లోతులో భూమి కంపించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం కాని జరలేదు. భూకంప తీవ్రతకు ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యారు. ముందు జాగ్రత్తగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. అధికారులు సునామీ హెచ్చరిక జారీ చేశారు.   

Tags:    

Similar News