America:అమెరికాలో 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా..!
అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగాల కోత విషయంలో ట్రంప్ సర్కార్ వ్యూహం మెల్లగా ఫలిస్తోంది. గురువారంతో ది ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ ఇచ్చిన బై అవుట్ ఆఫర్ గడువు ముగియనుంది.
అమెరికాలో 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా..!
America: అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగాల కోత విషయంలో ట్రంప్ సర్కార్ వ్యూహం మెల్లగా ఫలిస్తోంది. గురువారంతో ది ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ ఇచ్చిన బై అవుట్ ఆఫర్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ కొలువులకు రాజీనామా చేసేందుకు అంగీకరించినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం తెలిపింది. ఈ విషయాన్ని ఓపీఎం ధ్రువీకరించింది. కాకపోతే ట్రంప్ కార్యవర్గం ఊహించిన దానికంటే ఈ సంఖ్య చాలా చిన్నది. ఇది భవిష్యత్తులో వేగంగా పెరుగుతుందని తెలిపింది.
బై అవుట్ ఆఫీస్ పర్సనల్ మేనేజ్‌మెంట్ నుంచి ఒక మెమో వెలువడింది. ఈ మేరకు ఒక ఈమెయిల్ 20 లక్షల మంది ఉద్యోగులకు వెళ్లింది. స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకొంటే ఎనిమిది నెలల జీతం ఇస్తారని అందులో తెలిపారు. ఫిబ్రవరి 6వ తేదీలోపు ఓ నిర్ణయానికి రావాలని అందులో వివరించారు. దీనిని ఎంచుకొన్న వారికి సెప్టెంబర్ వరకు పనిచేయకుండానే జీతం పొందవచ్చని చెబుతున్నా.. దానికి ఎలాంటి హామీ లేదని ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సుమారు 10-15 శాతం మంది దీనిని ఎంచుకోవచ్చని ట్రంప్ కార్యవర్గం భావించింది. ఇది విజయవంతంగా అమలైతే అమెరికా ప్రభుత్వ ఖర్చులు ఏటా 100 బిలియన్ డాలర్ల వరకు తగ్గవచ్చని భావిస్తున్నారు. ఓ వైపు ఫెడరల్ నిధులు, రుణాలను నిలిపివేసిన వేళ ఈ వార్త బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. చాలా స్థానిక సంస్థల ప్రభుత్వాలు, నాన్ ప్రాఫిట్ సంస్థలపై దీని ప్రభావం ఉండనుందని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.
ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు కూడా కాకముందే ఆయన పనులు ఎవ్వరికి మింగుడు పడడంలేదు. అక్రమ వలసదారులు, పనామా పై పంతం, ఇప్పుడు ఏకంగా 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలేం జరుగుతుందో అర్థం కాక అయోమయంలో పడిపోతున్నారు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారోనని భయాందోళనకు గురవుతున్నారు. నెలరోజుల్లోనే ట్రంప్ ఇలా చేస్తే.. మరి ముందు ముందు తన ఎఫెక్ట్ ఇంకెలా ఉంటుందో అంటున్నారు విశ్లేషకులు.