ఉక్రెయిన్‌పై దాడులను తీవ్రతరం చేస్తోన్న రష్యా.. 32.50 లక్షల మంది వలస...
Russia - Ukraine War: నిరాశ్రయులవుతున్న లక్షల మంది ప్రజలు...
ఉక్రెయిన్‌పై దాడులను తీవ్రతరం చేస్తోన్న రష్యా.. 32.50 లక్షల మంది వలస...
Russia - Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా నానాటికీ దాడులను తీవ్రతరం చేస్తోంది. ముఖ్య నగరాలు, కార్యాలయాలు, పౌరుల ఆవాసాలపై కూడా దాడులకు తెగబడుతోంది. దీంతో కొన్ని లక్షల మంది నిరాశ్రయులవుతున్నారు. ఉక్రెయిన్ నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు. ఇలా యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ను విడిచిపెట్టి, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి సంఖ్య 32.50 లక్షలు.
ఇందులో 20 లక్షల మంది పోలాండ్ బార్డర్ దాటి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితికి చెందిన రెఫ్యూజీస్ ఎజెన్సీ ప్రకటించింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రకటించింది మొదలు ఇప్పటి వరకూ 32.50 లక్షల మంది దేశాన్ని విడిచిపెట్టారని పేర్కొంది.