అమెరికాలో కోరలు చాస్తున్న కరోనా.. 3,000 దాటిన మృత్యుల సంఖ్య

Update: 2020-03-31 04:11 GMT

కరోనా అమెరికాను గడగడలాడిస్తోంది. స్పీడ్ గా పెరుగతోన్న పాజిటివ్ కేసులు అగ్రరాజ్యాన్ని అల్లాడిస్తోంది. మృతుల సంఖ్య భారీగా ఉండటం మరింత కలవరపరుస్తోంది. నిన్న ఒక్కరోజే ఏకంగా 540 మందిమృత్యువాత పడ్డారు. దీంతో వైరస్‌తో పోరాడుతూ మరణించిన వారి సంఖ్య 3017కు పెరిగింది. ఇక వైరస్‌ బారిన పడ్డవారి సంఖ్య 1,63,000లకు చేరింది. న్యూయార్క్‌, న్యూజెర్సీ రాష్ట్రాల్లో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారి చికిత్సకు ఆస్పత్రులే కరవయ్యాయి. దీంతో అక్కడి ప్రభుత్వం ఓ భారీ నౌకను ఆసుపత్రిగా మార్చింది. సోమవారం హడ్సన్‌ నదిలో ఒడ్డుకు చేరిన ఈ నౌకను రెండు రాష్ట్రాల ప్రజలు నదికిరువైపుల నిలబడి సంతోషంతో స్వాగతం పలికారు. 

Tags:    

Similar News