Road Accident:ఘోర ప్రమాదం..లోయలో పడ్డ బస్సు..26 మంది దుర్మరణం
Road Accident: పెరులో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 26మంది మరణించారు.
Road Accident: ఘోర ప్రమాదం..లోయలో పడ్డ బస్సు..26 మంది దుర్మరణం
Road Accident:దక్షిణ అమెరికాలోని పెరూలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 26మంది మరణించారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. అక్కడి స్థానిక కాలమాన ప్రకారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. రాజధాని లిమా నుంచి 40 మందికిపైగా ప్రయాణికులతో వెళ్తున్న బస్సు 200 మీటర్ల లోతులో ఉన్న లోయలోకి దూసుకెళ్లింది.
సమాచారం అందిన వెంటనే అక్కడి స్థానికులు, అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్ని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ ఇద్దరు బస్సు డ్రైవర్లను ఆసుపత్రికి తరలించారు. పర్వత రోడ్లు, వేగంగా వెళ్లడం, రోడ్లు సరిగ్గా లేకపోవడం, ట్రాఫిక్ సంకేతాలు లేకపోవడం వంటి కారణాల వల్ల పెరూలో తరచూగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. గత ఏడాది జరిగిన ప్రమాదాల్లో ఆ దేశంలో మొత్తం 3,100 మంది ప్రాణాలు కోల్పోయారు.