Spain First Queen: 150ఏళ్ల తర్వాత దేశానికి తిరిగొచ్చిన ఈ రాణి గారి కథ తెలుసుకోండి..! 20ఏళ్ల అందగత్తే....!!

Spain First Queen: 150ఏళ్ల తర్వాత దేశానికి తిరిగొచ్చిన ఈ రాణి గారి కథ తెలుసుకోండి..! 20ఏళ్ల అందగత్తే....!!

Update: 2026-01-17 01:38 GMT

Spain First Queen: స్పెయిన్ చరిత్రలో అరుదైన ఘట్టం మరోసారి ఆవిష్కృతం కానుంది. దాదాపు 150 సంవత్సరాల విరామం తర్వాత ఆ దేశ సింహాసనాన్ని ఒక మహిళ అధిష్టించబోతోంది. ఈ పరిణామం స్పెయిన్‌కే కాదు… ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం రాజు ఫెలిపే VI, రాణి లెటిజియా దంపతుల పెద్ద కుమార్తె అయిన యువరాణి లియోనోర్ భవిష్యత్ రాణిగా సిద్ధమవుతోంది. ఆమె సింహాసనారోహణతో, స్పానిష్ రాజవంశంలో కొత్త అధ్యాయం మొదలుకానుంది.

ఇదే కుటుంబానికి చెందిన ఇసాబెల్లా II 19వ శతాబ్దంలో స్పెయిన్‌ను పాలించారు. ఆమె తర్వాత దాదాపు శతాబ్దన్నర కాలం పాటు సింహాసనం పురుష వారసుల చేతుల్లోనే కొనసాగింది. ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని తిరిగి మార్చే బాధ్యత లియోనోర్‌కు దక్కనుంది. స్పానిష్ రాజ్యాంగం ప్రకారం, వారసత్వ విషయంలో లింగభేదం ఉండదు. రాజు లేదా రాణికి పుట్టిన మొదటి సంతానం ఎవరిదైనా, వారే సింహాసనానికి అర్హులు. ఈ నిబంధన ప్రకారం అక్టోబర్ 31న మాడ్రిడ్‌లో జన్మించిన లియోనోర్, తల్లిదండ్రుల తొలి సంతానం కావడంతో క్రౌన్ ప్రిన్సెస్‌గా గుర్తింపు పొందారు.

భవిష్యత్తు రాణిగా లియోనోర్ ప్రత్యేకంగా శిక్షణ పొందుతోంది. స్పానిష్ చట్టం ప్రకారం, సింహాసనానికి వారసుడు దేశ సాయుధ దళాల సర్వాధికారిగా వ్యవహరించాల్సి ఉంటుంది. అందుకే ఆమె సైనిక శిక్షణను తప్పనిసరిగా పూర్తి చేస్తోంది. విద్యాపరంగా కూడా ఆమె అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. వేల్స్‌లోని యునైటెడ్ వరల్డ్ కాలేజ్ (UWC) అట్లాంటిక్లో చదివి, ఇంటర్నేషనల్ బాకలారియేట్ డిప్లొమాను సాధించారు. అదే సమయంలో సైనిక శిక్షణను కూడా ప్రారంభించి, రాజ్యపాలనకు తగిన సిద్ధతను చూపిస్తున్నారు.

భాషా పరిజ్ఞానంలోనూ లియోనోర్ ముందంజలో ఉన్నారు. ఆమె స్పానిష్‌తో పాటు ఇంగ్లీష్, ఫ్రెంచ్, కాటలాన్ వంటి అనేక భాషలను ప్రావీణ్యంతో మాట్లాడగలగడం విశేషం. ఇది అంతర్జాతీయ వేదికలపై స్పెయిన్ ప్రతిష్ఠను మరింత బలపరచనుంది. సైనిక శిక్షణలో యువరాణి లియోనోర్ ఇప్పటికే పలు చారిత్రక మైలురాళ్లను అధిగమించారు. నావికా శిక్షణలో భాగంగా జువాన్ సెబాస్టియన్ డి ఎల్కానో నౌక సిబ్బందితో కలిసి అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా సుమారు 17,000 మైళ్ళ ప్రయాణం చేశారు. అంతేకాదు, బ్లాస్ డి లెజో అనే యుద్ధనౌకపై కూడా సేవలందించారు.

విమానయాన శిక్షణలోనూ ఆమె ప్రత్యేక రికార్డు నెలకొల్పారు. 2025 డిసెంబర్‌లో పిలాటస్ PC-21 విమానాన్ని ఒంటరిగా నడిపిన తొలి స్పానిష్ యువరాణిగా చరిత్రలో నిలిచారు.ఈ అన్ని అనుభవాలతో, యువరాణి లియోనోర్ కేవలం వారసురాలిగా మాత్రమే కాదు… ఆధునిక స్పెయిన్‌కు నాయకత్వం వహించగల శక్తివంతమైన రాణిగా ఎదుగుతోంది. ఆమె సింహాసనారోహణ కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

Tags:    

Similar News