Delta Air Lines: కెనడాలోని టొరంటో పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ప్రమాదం జరిగింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత అదుపుతప్పి బోల్తొకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మందికి గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎయిర్ పోర్టు వర్గాలు తెలిపాయి. ప్రమాదానికి గురైన డెల్టా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం అమెరికాలోని మిన్నెపొలిస్ నుంచి వచ్చినట్లు తెలిపాయి. ప్రమాదం జరిగిన వెంటనే భద్రత సిబ్బంది అలర్ట్ అయ్యారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు ఎయిర్ పోర్టు వర్గాలు ఎక్స్ వేదికగా వెల్లడించాయి.