కాంబోడియాలో ఘోర అగ్నిప్రమాదం.. 10 మంది సజీవదహనం, 30 మందికి గాయాలు
Cambodia: క్యాసినో సెంటర్‌లో చెలరేగిన మంటలు
కాంబోడియాలో ఘోర అగ్నిప్రమాదం.. 10 మంది సజీవదహనం, 30 మందికి గాయాలు
Cambodia: థాయ్‌లాండ్ సరిహద్దులోని కాంబోడియాన్ హోటల్ క్యాసినోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది సజీవ దహనమైనట్టు పోలీసులు తెలిపారు. పోయిపేట్‌లోని గ్రాండ్ డైమండ్ సిటీ క్యాసినో హోటల్‌లో గత అర్థరాత్రి 11:30 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో మరో 30 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో క్యాసినోలో సుమారు 400 మంది వరకు పనిలో ఉన్నారని పోలీసులు చెప్పారు. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో పరిసర ప్రాంతాల జనం భయంతో వణికిపోయారు.