🇺🇸 డొనాల్డ్ ట్రంప్ జీ7 పర్యటనకు ముగింపు.. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం వేగంతో అమెరికాకు తిరుగు ప్రయాణం
Donald Trump కెనడాలో జీ7 పర్యటనను అర్ధాంతరంగా ముగించి అమెరికాకు తిరిగొచ్చారు. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం తీవ్రత పెరగడంతో అత్యవసర భద్రతా సమావేశాలకు సిద్ధమవుతున్నారు. ట్రంప్ కీలక ప్రకటన చేసే అవకాశం.
🇺🇸 డొనాల్డ్ ట్రంప్ జీ7 పర్యటనకు ముగింపు.. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం వేగంతో అమెరికాకు తిరుగు ప్రయాణం
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంటుండటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కెనడా జీ7 పర్యటనను తక్షణమే ముగించి స్వదేశానికి తిరిగారు. పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు, క్షిపణి దాడులు, అంతర్జాతీయ భద్రతాపై ప్రభావం చూపే పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
వెళ్లగానే ట్రంప్ వైట్‌హౌస్ సిట్యుయేషన్ రూమ్‌లో భద్రతా సలహాదారులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్టు అధికారికంగా వెల్లడించారు. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం, అమెరికా జోక్యం, భద్రతా చర్యలపై ఆయన కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
🗣️ "ఇది అత్యవసరం.. తిరిగి వెళ్లాల్సిందే": ట్రంప్
జీ7 సదస్సులో భాగంగా యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌తో ట్రంప్ కీలక ఒప్పందం చేసుకున్నప్పటికీ, యుద్ధ వాతావరణం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆయన పర్యటనను అర్ధాంతరంగా ముగించారు. “ఇది చాలా ముఖ్యం.. నాకు తిరిగి వెళ్లాల్సిందే,” అని ఇతర జీ7 దేశాధినేతలకు ట్రంప్ వెల్లడించారు.
ఈ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యూయేల్ మెక్రాన్ మాట్లాడుతూ, ట్రంప్ వెనుదిరగడమే సరైన నిర్ణయమని వ్యాఖ్యానించారు. జీ7 దేశాధినేతలు పశ్చిమాసియాలో శాంతిని పునరుద్ధరించాలని పిలుపునిచ్చారు.
టెహ్రాన్ దద్దరిల్లుతోంది: ఇజ్రాయెల్ దాడులు వేగవంతం.. అమెరికా జోక్యానికి రంగం సిద్ధమా?
ఇరాన్‌లో ఉన్న అమెరికన్ పౌరులను తక్షణమే ఆ ప్రాంతం వదిలిపెట్టాలని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. ఇది చూస్తే, అమెరికా ప్రత్యక్షంగా ఇరాన్‌పై దాడులకు సిద్ధమవుతోందా? అనే అనుమానాలు నెలకొన్నాయి. వాస్తవానికి, ఇజ్రాయెల్ క్షిపణి దాడుల నేపథ్యంలో అమెరికా స్పందన ప్రపంచస్థాయిలో ఆసక్తికరంగా మారింది.