అంతర, మిశ్రమ విధానంలో కూరగాయల సాగు

Update: 2020-09-23 12:25 GMT

రసాయనిక సాగులో నష్టాల దూలాలకు వేలాడుతున్న రైతులకు తిరిగి ఊపిరి పోస్తుంది ప్రకృతి వ్యవసాయం. దేశీ విత్తనాలు, అంతర, మిశ్రమ పంటల విధానాలు సాగులో రైతులకు లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ఆ విధంగానే మిశ్రమ పంటలుగా కూరగాయలను సాగు చేస్తూ ప్రకృతి వ్యవసాయంలో లాభాలు ఆర్జిస్తున్న గుంటూరు జిల్లా చెందిన రైతు పృథ్విరాజ్ పై ప్రత్యేక కథనం.

సాధారణంగా చాలా మంది రైతులు, కోత అనంతరం వ్యర్థాలుగా ఉన్న పంటను తగలపెడుతుంటారు. కానీ ప్రకృతి వ్యసాయంలో ఉపయోగపడనిది అంటూ ఏది ఉండదని, పంట వ్యర్థాలను మల్చింగ్ పద్ధతిలో వాడుకుంటే నేలకు అదనపు సారాన్ని అందించడమే కాకుండా ప్రతీ వాన చినుకును సాగుకు ఉపోయోగించుకుంటూ, నేలలో తేమ శాతాన్ని కాపాడుకోవడంలో ఈ వ్యర్థాలు ఉపయోగపడతాయంటున్నాడు ఈ రైతు.

ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ఏడు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామని, అందులో భాగంగా అంతర పంటల విధానంలో మిర్చి, బెండ, కీరదోస, సాగు చేస్తూ కిచెన్ గార్డెన్ విధానంలో ఆకుకూరలు, అరటి సాగు చేస్తున్నామని అంటున్నారు ICRP సభ్యురాలు రాగిణి. మొక్కల్లో చీడపీడల నివారణకు ఎలాంటి రసాయనాలు లేకుండా పూర్తి స్థాయి ప్రకృతి కషాయాలను వాడతామని అంటున్నారు.

పంట చేతికొచ్చే సమయంలో పంటను ఆశించే కత్తెర, గులాబీ వంటి పురుగులు సృష్టించే నష్టం అంతా ఇంతా ఉండదు, చేతికొచ్చిన పంటను సైతం చేవలేకుండా చేసి రైతులకు తీరని దుఃఖాన్ని మిగిలిస్తాయి. ఇలాంటి కీటకాల సమస్యను అరికట్టడానికి తానే స్వయంగా లింగాకర్షక బుట్టలను తయారుచేసుకున్నాడు రైతు పృథ్విరాజ్.

Full View


Tags:    

Similar News