రైతుకు గుడ్‌న్యూస్.. అధిక దిగుబడినిచ్చే దేశవాళీ శనగ

Nandyal: శనగలో మరో కొత్త వంగడాన్ని శాస్త్రవేత్తలు కర్షకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అధిక దిగుబడి అందించే సరికొత్త వంగడాన్ని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం విడుదల చేసింది.

Update: 2021-09-02 09:02 GMT

రైతుకు గుడ్‌న్యూస్.. అధిక దిగుబడినిచ్చే దేశవాళీ శనగ

Nandyal: శనగలో మరో కొత్త వంగడాన్ని శాస్త్రవేత్తలు కర్షకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అధిక దిగుబడి అందించే సరికొత్త వంగడాన్ని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం విడుదల చేసింది. నంద్యాల గ్రామ్‌ 857 పేరుతో కొత్త శనగ రకాన్ని రూపొందించారు. ఇప్పటివరకు లభిస్తున్న రకాలకంటే ఈ రకం అధిక దిగుబడిని ఇవ్వడంతో పాటు చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే గుణం సైతం కలిగివున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి ఈ కొత్తం రకం శనగ విత్తనాలు సాగుదారుకు ఏ విధంగా సహాయపడతాయి.? ఎంత దిగుబడిని అందిస్తాయి? శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలితస్తుందా అనేదానిపై ప్రత్యేక కథనం.

ఆరుగాలం శ్రమించి పంట సాగు చేస్తూ రైతు అన్నదాతగా అపార సేవలు అందిస్తున్నాడు. మరో వైపు శాస్త్రవేత్తలు రైతులకు తోడ్పాటును అందించేందుకు నిర్విరామంగా పరిశోధనలు జరుపుతున్నారు. ముఖ్యంగా నాణ్యమైన, అధిక దిగుబడిని, చీడపీడలు ఎదుర్కొనే సత్తా కలిగిన కొత్త వంగడాలను రైతులకు అందించేందకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ కొత్త రకం శనగ వంగడం రైతులకు అందుబాటులోకి తెచ్చింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శనగ ముఖ్యమైన రబీ పంట. ఈ నేపథ్యంలో మేలైన వంగడాన్ని రూపొందించి రైతులకు మేలు చేసేందుకు అఖిలభారత సమన్వయ పథకం ద్వారా మూడేళ్లుగా శనగ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జయలక్ష్మీ సారధ్యంలోని శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు జరిపింది. వీరి కృషి ఫలితంగా ఎన్‌బీఈజీ 857 దేశవాళీ శనగ వంగడాన్ని రూపొందించారు. ఇప్పటి వరకు ఉన్న వంగడంకంటే ఇది మేలైనదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

నంద్యాల వ్యవసాయ పరిశోధన క్షేత్రం అందుబాటులో కి తెచ్చిన కొత్త రకం శనగ వంగడం దేశవాళీరకం. ఇది రైతుల పాలిట వరంగా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నంద్యాల గ్రామ్‌ అధిక దిగుబడులనే కాదు చీడపీడలను కూడా తట్టుకుంటుందంటున్నారు. ఇతర శనగ రకాలతో పోలిస్తే ఈ కొత్త వంగడం ఎంతో మేలైంది. వంద గింజల బరువు 234 గ్రాములు కాగా పోషకాల స్థాయిలు 75 శాతం వరకు ఉంటుంది. గింజలు కూడా చూసేందుకు ఆకర్షణగా ఉంటాయి. ఇక పంటకాలం 95రోజులు నుంచి వంద రోజులు ఉంటుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు లో కూడా ఈ రకం విత్తనాలు సాగుకు అనుకూలం. రైతులకు మేలు చేసే దేశవాళీ శనగ కొత్త వంగడం నంద్యాల గ్రామ్ -857కు గ్రీన్ సిగ్నల్ రావడం పట్ల శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో శనగలో వచ్చిన ఈ కొత్త వంగడం తమకు ఎంతో మేలు చేస్తుందని రైతుల నుంచి ఆశాభావం వ్యక్తమౌతుంది.

Full View


Tags:    

Similar News